'ఆసీస్ మీడియాను పక్కకు పెట్టండి'
న్యూఢిల్లీ: రెండో టెస్టు సందర్బంగా ఆసీస్ కెప్టెన్ డీఆర్ఎస్ డ్రెస్సింగ్ రూమ్ వివాదం అనంతరం మన క్రికెటర్ల ప్రవర్తనను తప్పుగా చూపట్టడమే పనిగా పెట్టుకున్న ఆ దేశ మీడియాపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు. ఒక ముగిసిన అధ్యాయాన్ని ఆసీస్ మీడియా సాగదీస్తూ వరుస కథనాలను ప్రవర్తించడం ఎంతమాత్రం సమంజసం కాదన్నాడు. ప్రధానంగా కోహ్లి, కుంబ్లేలపై ఆరోపణలు చేసిన ఆసీస్ మీడియాను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని గవాస్కర్ పేర్కొన్నాడు.
'ఆసీస్ మీడియా ఓవరాక్షన్ ను పెద్దగా పట్టించుకోనక్కర్లేదు. వారి క్రికెట్ కు మద్దతిచ్చే క్రమంలో ఆసీస్ మీడియా పక్షపాతంతో వ్యవహరిస్తోంది. వీటిన పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆఫ్ ద ఫీల్డ్ విషయాల్ని పక్కకు పెట్టి క్రికెట్ పై దృష్టి పెట్టండి'అని భారత క్రికెటర్లకు గవాస్కర్ సూచించాడు.