గేల్ ను తొందరగా అవుట్ చేస్తేనే...
బెంగళూరు: ఐపీఎల్-8లో భాగంగా సోమవారం జరగనున్న 8వ మ్యాచ్ లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లోనైనా నెగ్గి బోణి కొట్టాలని సన్ రైజర్స్ భావిస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడిన తొలి మ్యాచ్ లో హైదరాబాద్ ఓటమి చవిచూసింది.
మరోవైపు తన తొలి మ్యాచ్ లో డిపెండింగ్ చాంపియన్ కోల్ కతాను కంగుతినిపించిన బెంగళూరు అదే జోరు కొనసాగించాలన్న పట్టుదలతో ఉంది. ఒంటి చేత్తో మ్యాచ్ ను గెలిపించిన డాషింగ్ బ్యాట్స్ మన్ క్రిస్ గేల్ పై చాలెంజర్స్ ఆశలు పెట్టుకుంది. గేల్ ను ఎంత తొందరగా అవుట్ చేస్తారనే దానిపై హైదరాబాద్ విజయవకాశాలు ఆధాపడివుంటాయి. ఏబీ డివిలియర్స్, విరాట్ కోహ్లి, దినేష్ కార్తీక్, రోసో.. తమ స్థాయి మేరకు ఆడితే బెంగళూరును ఆపడం కష్టం.
బౌలింగ్ ను నమ్ముకున్న సన్ రైజర్స్ తొలి మ్యాచ్ లో స్టెయిన్ ను ఆడించకుండా మూల్యం చెల్లించుకుంది. ఈ మ్యాచ్ లో అతడు బరిలోకి దిగే అవకాశముంది. ధావన్, వార్నర్, కానే విలియమ్సన్, బొపారా బ్యాటింగ్ భారం మోయనున్నారు.