జి‘గేల్’
ఒంటిచేత్తో బెంగళూరును గెలిపించిన గేల్
3 వికెట్ల తేడాతో ఓడిన కోల్‌కతా
కోల్‌కతా: బెంగళూరు లక్ష్యం 178 పరుగులు... స్కోరు 93/4.... ఓ ఎండ్‌లో వెనుదిరుగుతున్న సహచరులు... గెలవాలంటే 54 బంతుల్లో 85 పరుగులు చేయాలి... ఈ దశలో క్రిస్ గేల్ (56 బంతుల్లో 96; 7 ఫోర్లు, 7 సిక్సర్లు) సునామీ సృష్టించాడు. బౌండరీలు, సిక్సర్లతో మోత మోగించాడు. దీంతో శనివారం ఈడెన్‌గార్డెన్స్‌లో జరిగిన ఐపీఎల్-8 మ్యాచ్‌లో బెంగళూరు 3 వికెట్ల తేడాతో కోల్‌కతాపై విజయం సాధించింది. టాస్ గెలిచి బెంగళూరు ఫీల్డింగ్ ఎంచుకోగా... కోల్‌కతా 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది.
ఉతప్ప (28 బంతుల్లో 35; 4 ఫోర్లు), గంభీర్ (46 బంతుల్లో 58; 7 ఫోర్లు, 1 సిక్స్) తొలి వికెట్‌కు 81 పరుగులు జోడించారు. చివర్లో రస్సెల్ (17 బంతుల్లో 41 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడటంతో కోల్‌కతాకు భారీస్కోరు లభించింది. బెంగళూరు 19 ఓవర్లలో 7 వికెట్లకు 179 పరుగులు చేసి నెగ్గింది. కోహ్లి (15 బంతుల్లో 13; 1 సిక్స్) విఫలంకాగా... డివిలియర్స్ (13 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) చకచకా పరుగులు చేశాడు. కోల్‌కతా బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీసినా... గేల్ మాత్రం నిలకడగా ఆడాడు. తృటిలో సెంచరీ కోల్పోయినా ఒంటరిపోరాటంతో జట్టుకు విజయాన్ని ఖరారు చేశాడు.
స్కోరు వివరాలు
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (సి) స్యామీ (బి) అహ్మద్ 35; గంభీర్ (సి) మన్‌దీప్ (బి) చాహల్ 58; మనీష్ పాండే రనౌట్ 23; సూర్య కుమార్ (సి) మన్‌దీప్ (బి) హర్షల్ 11; యూసుఫ్ (సి) కోహ్లి (బి) ఆరోన్ 3; రస్సెల్ నాటౌట్ 41; షకీబ్ రనౌట్ 0; పీయూష్ చావ్లా నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 177.
వికెట్ల పతనం: 1-81; 2-103; 3-131; 4-131; 5- 163; 6-173. బౌలింగ్: అబాట్ 3-0-36-0; హర్షల్ పటేల్ 4-0-37-1; ఆరోన్ 4-0-38-1; అహ్మద్ 4-0-28-1; స్యామీ 1-0-7-0; చాహల్ 4-0-28-1.
బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఇన్నింగ్స్: గేల్ రనౌట్ 96; కోహ్లి (సి) ఉతప్ప (బి) మోర్నీ 13; దినేశ్ కార్తీక్ (బి) యూసుఫ్ 6; మన్‌దీప్(బి) యూసుఫ్ 6; డివిలియర్స్ (స్టం) ఉతప్ప (బి) కరియప్ప 28; స్యామీ (స్టం) ఉతప్ప (బి) షకీబ్ 7; అబాట్ రనౌట్ 1; హర్షల్ నాటౌట్ 9; అహ్మద్ నాటౌట్ 5; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: (19 ఓవర్లలో 7 వికెట్లకు) 179.
వికెట్ల పతనం: 1-29; 2-50; 3-56; 4-93; 5-119; 6-133; 7-171. బౌలింగ్: మోర్కెల్ 4-0-35-1; నరైన్ 4-0-26-0; కరియప్ప 2-0-28-1; రస్సెల్ 2-0-16-0; యూసుఫ్ పఠాన్ 4-0-40-2; పీయూష్ చావ్లా 1-0-10-0; షకీబ్ 2-0-17-1.