మరో విజయంపై సన్‌రైజర్స్‌ దృష్టి | Sunrisers Hyderabad Won The Toss Elected to Field Firtst Over KKR | Sakshi
Sakshi News home page

మరో విజయంపై సన్‌రైజర్స్‌ దృష్టి

Published Sun, Apr 21 2019 3:47 PM | Last Updated on Sun, Apr 21 2019 4:04 PM

Sunrisers Hyderabad Won The Toss Elected to Field Firtst Over KKR - Sakshi

హైదరాబాద్‌: సొంతగడ్డపై మరో విజయం సాధించాలనే లక్ష్యంతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌... ఈ సీజన్‌లో వరుస పరాజయాల పరంపరకు తెరదించాలనే పట్టుదలతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌లు ఆదివారం ఉప్పల్‌ స్టేడియంలో జరిగే ఐపీఎల్‌ మ్యాచ్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.  ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ టాస్‌ గెలిచి తొలుత ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఇప్పటివరకూ సన్‌రైజర్స్‌ ఎనిమిది మ్యాచ్‌లు ఆడి నాలుగింట విజయం​ సాధించగా, కేకేఆర్‌ తొమ్మిది మ్యాచ్‌లకు గాను నాలుగు విజయాల్ని మాత్రమే నమోదు చేసింది. అంతకముందు ఇరు జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్‌లో కేకేఆర్‌ గెలుపొందింది.

వరుసగా నాలుగు పరాజయాలు చవిచూసిన కోల్‌కతా జట్టు ప్రధాన ఆండ్రీ రసెల్, నితీశ్‌ రాణా మెరుపు బ్యాటింగ్‌పై ఆధారపడుతోంది. వీరిద్దరిని కట్టడి చేసి తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు పంపించడంపై హైదరాబాద్‌ బౌలర్లు భువనేశ్వర్, రషీద్‌ ఖాన్, ఖలీల్‌ అహ్మద్‌ దృష్టి సారించాల్సి ఉంటుంది. ఒకవేళ రసెల్, నితీశ్‌ రాణా క్రీజులో నిలదొక్కుకుంటే మాత్రం హైదరాబాద్‌ ప్రేక్షకులకు పరుగుల విందు ఖాయమనుకోవాలి. ఈడెన్‌ గార్డెన్స్‌లో శుక్రవారం రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రసెల్, నితీశ్‌ రాణా ఆకాశమే హద్దుగా చెలరేగి కోల్‌కతా జట్టును దాదాపు విజయం అంచుల వరకు తెచ్చారు. ఓపెనర్లు క్రిస్‌ లిన్, సునీల్‌ నరైన్‌ శుభారంభం అందిస్తే మిడిలార్డర్‌పై ఒత్తిడి తగ్గుతుంది. మిడిలార్డర్‌లో రాబిన్‌ ఉతప్ప, శుబ్‌మన్‌ గిల్, దినేశ్‌ కార్తీక్‌ చెప్పుకోతగ్గ ఇన్నింగ్స్‌ ఆడలేదు.  

మరొకవైపు డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్, బెయిర్‌స్టో అర్ధ సెంచరీలు సాధించి సన్‌రైజర్స్‌ విజయంలో ముఖ్యపాత్ర పోషించారు. సన్‌రైజర్స్‌ భారీ స్కోరు చేయాలన్నా... లక్ష్యఛేదనలో దూసుకుపోవాలన్నా... వార్నర్, బెయిర్‌స్టోలలో ఒక్కరు సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ వీరిద్దరు తక్కువ స్కోరుకు ఔటైతే కెప్టెన్‌ విలియమ్సన్, విజయ్‌ శంకర్, యూసుఫ్‌ పఠాన్, దీపక్‌ హుడా క్రీజులో నిలదొక్కుకొని సన్‌రైజర్స్‌ స్కోరు బోర్డును పరుగెత్తించే బాధ్యత తీసుకోవాలి.  

కేకేఆర్‌
దినేశ్‌ కార్తీక్‌(కెప్టెన్‌), క్రిస్‌ లిన్‌, సునీల్‌ నరైన్‌, శుభ్‌మన్‌ గిల్‌, నితీష్‌ రాణా, రింకూ సింగ్‌, ఆండ్రీ రసెల్‌, పీయూష్‌ చావ్లా, కేసీ కరియప్ప, గర్నీ, పృథ్వీరాజ్‌

సన్‌రైజర్స్‌
కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌ స్టో, విజయ్‌ శంకర్‌, దీపక్‌ హుడా, యూసఫ్‌ పఠాన్‌, రషీద్‌ ఖాన్‌, నదీమ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, సందీప్‌ శర్మ, ఖలీల్‌ అహ్మద్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement