మూడో రోజు రెండు పతకాలు | third day, two medals | Sakshi
Sakshi News home page

మూడో రోజు రెండు పతకాలు

Published Fri, Mar 24 2017 12:47 AM | Last Updated on Tue, Sep 5 2017 6:54 AM

third day, two medals

న్యూఢిల్లీ: ఫజా అంతర్జాతీయ పారా అథ్లెటిక్స్‌ గ్రాండ్‌ప్రి మీట్‌లో మూడో రోజు భారత క్రీడాకారులు రెండు పతకాలు సాధించారు. పురుషుల వీల్‌ఛైర్‌ ఎఫ్‌– 55/56 విభాగంలో నీరజ్‌ యాదవ్‌ 25.01మీ., అమిత్‌ బల్యాన్‌ 24.93మీ. దూరం జావెలిన్‌ విసిరి రజత, కాంస్య పతకాలు సాధించారు.

మరోవైపు భారత క్రీడాకారిణి ఏక్తా భయాన్‌ క్లబ్‌ 397గ్రా.ల ఎఫ్‌–32/51 విభాగంలో 16.63మీటర్లతో నాలుగో స్థానంలో నిలిచి పతకం చేజార్చుకుంది. కానీ, ఈ ప్రదర్శనతో ఎఫ్‌–51లో ఏక్తా ఆసియా రికార్డును తిరగరాసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement