క్రిస్మస్ సెలవు రద్దు | Cancel Christmas holiday | Sakshi
Sakshi News home page

క్రిస్మస్ సెలవు రద్దు

Published Tue, Dec 16 2014 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 6:13 PM

క్రిస్మస్ సెలవు రద్దు

క్రిస్మస్ సెలవు రద్దు

 సాక్షి, చెన్నై: క్రిస్మస్ పర్వదినం రోజున సెలవును రద్దు చేస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ తీసుకున్న చర్యలు వివాదానికి దారి తీస్తున్నారుు. క్రైస్తవ సామాజిక వర్గానికి అత్యంత పవిత్రమైన రోజున సెలవు రద్దు చేయడాన్ని తమిళనాడులోని రాజకీయ పక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కేంద్రం తీరును దుయ్యబట్టాయి. సెలవు రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఏసు క్రీస్తు జన్మదినం క్రిస్మస్. ఈ రోజును అత్యంత పవిత్రంగా ప్రపంచంలోని క్రైస్తవులందరూ భావిస్తారు. ఈ పర్వదినం జాతీ య సెలవు దినం. అయితే, కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ ప్రభుత్వం ఈ సెలవును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదం అవుతోంది.
 
 ఈనెల 25న మాజీ ప్రధాని వాజ్‌పేయ్, హిందూ మహా సభ నేత మదన్ మోహన్ మాల్యా జన్మదినం కూడా కావడంతో ఆ ఇద్దరికి ప్రాధాన్యతను ఇస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ నిర్ణయం తీసుకోవడం చర్చకు దారి తీసింది. ఆ రోజును మంచి రోజుగా భావించి పాఠశాలల్లో వాజ్‌పేయ్, మదన్‌మోహన్ మాల్యా జీవిత గాథలకు సంబంధించి వక్తృత్వ, వ్యాస రచన పోటీలను విద్యార్థులకు నిర్వహించాలని మాన వనరుల శాఖ ఆదేశాలు జారీ చేయటం వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా సీబీఎస్‌ఈ, నవోదయ స్కూళ్లకు తప్పని సరిగా సెలవురద్దుతోపాటుగా పోటీలు నిర్వహించాలని ఉత్తర్వులు వెలువడడాన్ని తమిళనాడులోని రాజకీయపక్షాలు తీవ్రంగా పరిగణించాయి. అత్యంత పవిత్రంగా భావించే క్రిస్మస్ పర్వదినాన సెలవు రద్దు చేయడం వివాదానికి దారి తీస్తోంది.
 
 వివాదం : రాష్ట్రంలో క్రైస్తవ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు అత్యధికంగానే ఉన్నారు. సీబీఎస్‌ఈ, నవోదయ స్కూళ్లల్లో ఆ సామాజిక వర్గం పిల్లలు చదువుకుంటున్నారు. సెలవు రద్దు సమాచారంతో క్రైస్తవ సామాజిక వర్గ సంఘాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది కేంద్రం తీరును ఆ సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఇక ఎండీఎంకే నేత వైగో కేంద్రం తీరుపై శివాలెత్తారు. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబరు 25ను సెలవు దినంగా పాటిస్తుంటే, కేంద్రం మాత్రం ఆ సెలవును సీబీఎస్‌ఈ, నవోదయ తదితర కేంద్రీయ స్కూళ్లకు రద్దు చేయడం విచారకరంగా పేర్కొన్నారు. అన్ని మతాలను సమానంగా చూడాల్సిన కేంద్రం తన మత స్వరూపాన్ని చాటుకునే పనిలో పడిందని ధ్వజమెత్తారు. తన నిర్ణయాన్ని కేంద్రం ఉప సంహరించుకోని పక్షంలో తీవ్ర పరిణామాల్ని చవి చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. క్రైస్తవులకు అత్యంత పవిత్ర దినంగా ఉన్న క్రిస్మస్‌ను వివాదం చేస్తూ, తమ స్వలాభం కోసం వాడుకునే రీతిలో కేంద్రం ముందుకు సాగుతోందని మండిపడ్డారు. ఈలం తమిళుల విషయంలో, తమిళ జాలర్ల విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరు మరువక ముందే, తాజాగా క్రిస్మస్ సెలవు రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
 
 టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ పేర్కొంటూ, తన మతతత్వ స్వరూపాన్ని చాటుకునే విధంగా కేంద్రంలోని పాలకులు ముందుకు సాగుతున్నారని మండి పడ్డారు. నిన్నటికి నిన్న మంత్రులు, ఎంపీలు మైనారిటీలకు వ్యతిరేకంగా, మహాత్మా గాంధీకి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తూ దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని మండి పడ్డారు. ఈ సమయంలో క్రిస్మస్ సెలవును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం తీవ్రంగా ఖండించదగ్గ విషయంగా పేర్కొన్నారు. మైనారిటీ ప్రజలకు వ్యతిరేకంగా కేంద్రం తన దూకుడును ప్రదర్శించేందుకు సిద్ధమవుతోందని మండి పడ్డారు. ఆ ప్రజల మనో భావాలకు అనుగుణంగా నడుచుకోకుంటే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కేంద్ర సిలబస్ ఉన్న పాఠశాలలకు పంపిన ఉత్తర్వుల్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు.  
 
 కరుణ ఆగ్రహం
 క్రిస్మస్ సెలవు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిసూత డీఎంకే అధ్యక్షడు కరుణానిధి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ ప్రభుత్వ చర్యలు నానాటికీ పెచ్చుమీరుతున్నాయని మండి పడ్డారు. ఆ ప్రభుత్వ తీరు ఆవేదన కలిగిస్తోందన్నారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన అవసరం ఉంద ని హితవు పలికారు. అయితే, మతపరంగాను, భాషాపరంగాను ఏకపక్ష ధోరణి అనుసరించడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. క్రైస్తవులు ఏడాదికి ఒక సారి జరుపుకునే పండుగను సైతం అడ్డుకునే రీతిలో కేంద్రం చర్యలు ఉన్నాయని మండిపడ్డారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement