Former Prime Minister Vajpayee
-
Good Governance Day 2022: కలుపుకొని పోవడమే సుపరిపాలన
ఈ రోజు క్రిస్మస్ – యేసు క్రీస్తు పుట్టిన రోజు. ప్రేమ, శాంతి, కరుణ, సౌభ్రాతృత్వం అనే ఆయన బోధనలు మాన వాళికి జీవనాడి లాంటివి. ఈ సందర్భంగా దేశ ప్రజలంద రికీ... ముఖ్యంగా క్రైస్తవ పౌరు లకు నా క్రిస్మస్ శుభాకాంక్షలు. మన మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా 1924లో మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఇదే రోజున జన్మించడం యాదృచ్ఛికం! ఆయన శాంతి, సహ జీవనం, కరుణ, అందరికీ గౌరవం, సమానత్వం, న్యాయం, సోదరభావం వంటి ఆదర్శాలకు జీవితాంతం కట్టుబడి ఉన్నారు. కవి, రచయిత, పాత్రికేయుడు, రాజ నీతిజ్ఞుడు, స్వాతంత్య్ర సమరయోధుడు, దార్శనికుడుగా ప్రసిద్ధులు. వాజ్‌పేయి 1932లో ఆర్ఎస్ఎస్లో చేరారు. 1947లో ప్రచారక్ అయ్యారు. 1951లో భారతీయ జనసంఘ్‌లో సభ్యత్వం పొందడం ద్వారా అధికారి కంగా రాజకీయాల్లో చేరారు. శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనల ద్వారా ఆయన ఎంతో స్ఫూర్తి పొందారు. 1957లో తొలిసారిగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి ఉత్తరప్రదేశ్‌లోని బల్రాంపూర్ నుంచి ఎన్నికై... ఆ తర్వాత వెనుదిరిగి చూడలేదు. అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కూడా పార్ల మెంట్లో ఆయన చేసిన చర్చోపచర్చలకు ముగ్ధులై వాజ్‌పేయి తన స్థానాన్ని ‘ఒక రోజు’ ఆక్రమిస్తారని అంచనా వేశారు. 1980లో ఆయన భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడయ్యారు.1977లో జనతా పార్టీ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా, వివిధ ముఖ్యమైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల అధిపతిగా, ప్రతిపక్ష నాయకుడిగా దేశానికి తన అత్యుత్తమ సేవలను అందించారు. ఆయన ‘నేషన్ ఫస్ట్’ అనే విశ్వాసానికి ముగ్ధుడై, అప్పటి ప్రధాని పీవీ నర సింహారావు ప్రతిపక్ష నేతగా ఉన్న వాజ్‌పేయిని ఐక్య రాజ్యసమితిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించే ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించవలసిందిగా కోరారు. దౌత్య విషయాలపై ఆయన సాధికారత అద్భుతమైనది. 1996లో ఆయన బీజేపీ మొదటి ప్రధానమంత్రి అయ్యారు. అతి కొద్దిరోజులే ఆయన ప్రభుత్వం ఉంది. తరువాత 1998లో మళ్లీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన నాయకత్వంలో పోఖ్రాన్ వద్ద భారత్ రెండో దఫా అణుపరీక్షలను నిర్వహించింది. ఒకవైపు దేశ భద్రతకు కావలసిన ఏర్పాట్లు చేస్తూనే మరోవైపు పాకిస్తాన్‌తో సంబంధాలను మెరుగుపరుచుకోవాలనే ఆయన చూశారు. లాహోర్ బస్సు యాత్ర చేపట్టడం, ఆగ్రా శిఖరాగ్ర సమావేశానికి పర్వేజ్ ముషారఫ్‌ను భారత్‌కు ఆహ్వానించడం వంటివి ఆయన సాహసోపేత విధానంలో కొన్ని మెరుపులు. తర్వాత కార్గిల్ యుద్ధంలో ఆయన నాయకత్వంలో పాక్‌పై విజయం సాధించడం ముదావహం. ప్రధానమంత్రిగా వాజ్‌పేయి మౌలిక వసతులను ఉన్నతీకరించడానికి కృషి చేశారు. పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన సరళీకరణ స్ఫూర్తిని ముందుకు తీసుకు పోయి, మరిన్ని భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ప్రభుత్వ పెట్టుబడులను ఉపసంహరించడానికి ఏకంగా ప్రత్యేక ‘పెట్టుబడుల ఉపసంహరణ మంత్రిత్వ శాఖ’ను సృష్టించారు. 6–14 ఏళ్లలోపు పిల్లలకు ప్రాథమిక విద్యను ఉచితంగా అందించడానికి ‘సర్వశిక్షా అభియాన్’ను ప్రారంభిం చడం చారిత్రక నిర్ణయం. దేశంలో నదులను అను సంధానించాలనేది ఆయన చిరకాల వాంఛ. ‘స్వర్ణ చతుర్భుజి’ ప్రాజెక్ట్, ‘ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన’ ద్వారా రహదారుల నిర్మాణానికి గొప్ప ఊపునిచ్చారు. అనేక దశాబ్దాలుగా పార్టీలో, పార్లమెంట్లో, అలాగే కేంద్ర మంత్రివర్గంలో ఆయన సహాధ్యాయిగా ఉన్న నాకు... ఆయన ఒక నిష్ణాతుడైన రాజకీయ నాయకుడిగా, నిస్వార్థ, అంకితభావం ఉన్న నాయకు డిగా తెలుసు. పార్లమెంట్ కార్యకలాపాలకు అంత రాయం కలిగించే ప్రయత్నానికి ఎప్పుడూ ఆయన మద్దతు ఇవ్వలేదు. లాల్ కృష్ణ అడ్వాణీ రథయాత్ర చేస్తూ బిహార్‌లో అరెస్టు అయినప్పుడు నేను పార్ల మెంటు సభ్యుడిగా ఉన్నాను. ఆ సంద ర్భంగా వారం రోజులకు పైగా పార్లమెంట్ కార్య కలాపాలకు అంతరాయం ఏర్ప డింది. బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమా వేశంలో వాజ్‌పేయి మాట్లాడుతూ... ‘పార్ల మెంటు చర్చోప చర్చలకు వేదిక. మనం చర్చకు అనుమతించాలి. మన రాజకీయ పోరాటం పార్లమెంటు వెలుపల జర గాలి...’ అన్నారు. వాజ్‌పేయి దార్శనికతను అందిపుచ్చు కుని నేడు ప్రధాని నరేంద్ర మోదీ ఎవరూ వెనుకబడి ఉండకూడదు అన్న ‘ఆత్మ నిర్భర్ భారత్’ కల త్వరగా సాకారం అవ్వ డానికి సుపరిపాలన అందిస్తున్నారు. జన్‌ధన్–ఆధార్– మొబైల్ అనేవి ప్రజల జీవితాల్లో సానుకూల మార్పును తెచ్చాయి. వాజ్‌పేయి జయంతిని ‘జాతీయ సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటున్న సందర్భంగా, ప్రజలు, నాయకులు, అధికారులు... దేశం పట్ల భక్తినీ, సమాజం పట్ల గౌరవాన్నీ కలిగి ఉండాలి. బలమైన, ఆరోగ్యకర మైన, అందరినీ కలుపుకొని పోయే దేశ నిర్మాణమే వాజ్‌పేయికి నిజమైన నివాళి. స్వచ్ఛమైన రాజకీయాలు, స్వచ్ఛమైన పరిపాలనతో మాత్రమే భారత్‌ను విశ్వ గురువుగా తీర్చిదిద్ద గలుగుతాం! బండారు దత్తాత్రేయ వ్యాసకర్త హరియాణా గవర్నర్ (నేడు జాతీయ సుపరిపాలనా దినోత్సవం) -
వాజ్‌పేయి చనిపోయిందెప్పుడు? : శివసేన అనుమానం
-
వాజ్‌పేయి చనిపోయిందెప్పుడు? : శివసేన అనుమానం
ముంబై: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి ఆగస్టు 16నే మృతిచెందారా? అని ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన శివసేన అనుమానం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ పంద్రాగస్టు ప్రసంగానికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఆగస్టు 16 నాడు మృతి విషయాన్ని వెల్లడించారా? అని శివసేన అధికార పత్రిక సామ్నా.. సంపాదకీయంలో ప్రశ్నించింది. ‘ప్రజలకంటే ముందుగా.. మన నేతలు స్వరాజ్యం గురించి సరిగా అర్థం చేసుకోవాలి. వాజ్‌పేయి ఆగస్టు 16న మృతిచెందారు. కానీ 12–13 తేదీల నుంచే ఆయన ఆరోగ్యం తీవ్రంగా విషమిస్తోంది. ఉత్సాహంగా జరగాల్సిన స్వాతంత్య్ర దినోత్సవంనాడు దేశవ్యాప్తంగా సంతాపదినాలు, జెండాల అవనతం లేకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందా? లేక ఎర్రకోట మీదుగా సుదీర్ఘమైన మోదీ ప్రసంగానికి అడ్డంకులు లేకుండా ఉండేందుకు వాజ్‌పేయి మృతిని 16న ప్రకటించారా?’ అని ‘స్వరాజ్యమంటే ఏంటి?’ అనే శీర్షికతో ప్రచురించిన సంపాదకీయంలో శివసేన రాజ్యసభ ఎంపీ, సామ్నా ఎడిటర్ సంజయ్ రౌత్ అనుమానం వ్యక్తం చేశారు. -
బీజేపీ నేతల చేతిలో చావుదెబ్బలు.. జైలుకు!
ఔరంగాబాద్ : మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత అటల్ బిహారీ వాజ్‌పేయి సంతాప తీర్మానాన్ని వ్యతిరేకించిన ఏఐఎంఐఎం కార్పొరేటర్ సయ్యద్ మటీన్ రషీద్‌ను ఏడాది పాటు జ్యుడీషియల్ కస్టడీకి తీసుకున్నారు. ఔరంగాబాద్ పోలీసులు ఓ సంవత్సరం కాలం మటీన్‌ను జైలులో విచారించనున్నారు. ఏఐఎంఐఎం కార్పొరేటర్‌పై మహారాష్ట్ర చట్టం ఎంపీడీఏ-1981 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ఇటీవల వాజ్‌పేయి మరణానంతరం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో బీజేపీ కార్పొరేటర్ రాజు విద్యా సంతాప తీర్మాణాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని ఎంఐఎం సభ్యుడు సయ్యద్ మటీన్ వ్యతిరేకించారు. దీంతో రగిలిపోయిన బీజేపీ సభ్యులు ఆవేశంతో దాడికి దిగి సయ్యద్‌ను చితకబాదారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది వారి నుంచి సయ్యద్‌ను కాపాడి, చికిత్స నిమిత్తం దగ్గరలోని ఆసుపత్రికి తరలించిన విషయం విదితమే. మటీన్‌పై దాడి చేసిన వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. (‘వాజ్‌పేయికి నివాళి అర్పించను’.. రచ్చ రచ్చ!) అయితే గతంలోనూ జాతీయ గీతాన్ని ఆలపించడానికి మటీన్ నిరాకరించాడని.. ప్రస్తుతం వాజ్‌పేయి సంతాప తీర్మానాన్ని వ్యతిరేకించారని బీజేపీ కార్పొరేటర్లు తెలిపారు. మటీన్ తన చర్యల ద్వారా హిందూ-ముస్లిం మతాల విద్వేషాలు రెచ్చగొట్టే యత్నం చేశారని బీజేపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగర పోలీసు కమిషనర్ ఆదేశాల మేరకు సిటీ చౌక్ పోలీసులు మటీన్‌ను అరెస్ట్ చేసి హర్సల్ జైలుకు తరలించారు. మతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, శాంతి భద్రతలకు భంగం వాటిల్లే పనులు చేస్తే ఎంపీడీఏ కింద ఎవరినైనా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టాల్సి ఉంటుందని కమిషనర్ చిరంజీవ్ ప్రసాద్ వివరించారు. -
అటల్ బిహారీ వాజ్‌పేయి అంతిమ యాత్ర
-
వాజ్‌పేయి అంత్యక్రియలు పూర్తి
-
అటల్జీ..అల్విదా
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయికి దేశం కన్నీటితో వీడ్కోలు పలికింది. ‘మహనీయుడా మళ్లీ రా’ అంటూ స్వర్గానికి సాగనంపింది. కుటుంబ సభ్యులు, రాష్ట్రపతి, ప్రధాని తదితర ప్రముఖుల సమక్షంలో అధికార లాంఛనాలతో ఢిల్లీలో వాజ్‌పేయి అంత్యక్రియలు జరిగాయి. లక్షల మంది కార్యకర్తలు, పార్టీ నాయకులు, విపక్ష పార్టీల నేతలు, అభిమానుల అశ్రునయనాల మధ్య ఉద్విగ్న వాతావరణంలో ఈ కార్యక్రమం ముగిసింది. ‘అటల్ బిహారీ అమర్ రహే’ నినాదాలు స్మృతి స్థల్ వద్ద మార్మోగుతుండగా యమునా తీరంలో రాష్ట్రీయ స్మృతి స్థల్లో ఆయన దత్త పుత్రిక నమితా కౌల్ భట్టాచార్య.. వాజ్‌పేయి చితికి నిప్పంటించారు. అంతకుముందు, మాజీ ప్రధానికి గౌరవసూచకంగా 21 గన్‌సెల్యూట్‌తో నివాళులర్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ, అగ్రనేత ఎల్కే అడ్వాణీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, వివిధ పార్టీల నేతలు, ముఖ్యమంత్రులు తదితరులు అంత్యక్రియలకు హాజరయ్యారు. భూటాన్ రాజు, పాక్ ప్రతినిధి, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి సహా పలుదేశాల దౌత్యవేత్తలు కూడా అంత్యక్రియల్లో పాల్గొన్ని వాజ్‌పేయికి ఘనంగా నివాళులర్పించారు. ప్రముఖులంతా స్మృతిస్థల్లోనే.. వాజ్‌పేయి అంత్యక్రియల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని మోదీ, బీజేపీ అగ్రనేత అడ్వాణీ, పార్టీ చీఫ్ అమిత్ షా సహా రాజకీయ మహామహులంతా పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, సుష్మా స్వరాజ్, నిర్మలా సీతారామన్, పీయుష్ గోయల్, హర్ష వర్ధన్, రాంవిలాస్ పాశ్వాన్, శ్రీపాద్ నాయక్‌లు.. ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్, వైమానిక దళ చీఫ్ ఎయిర్ చీఫ్‌మార్షల్ బీరేందర్ సింగ్ ధనోవా, నౌకాదళ చీఫ్ అడ్మిరల్ సునీల్ లాంబాలు కూడా మాజీ ప్రధానికి త్రివిధ దళాల తరఫున ఘనంగా నివాళులర్పించారు. ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, నితీశ్ కుమార్, శివ్‌రాజ్ సింగ్ చౌహాన్, విజయ్ రూపానీ కూడా ఉద్వేగంగా తమ అభిమాన నేతకు వీడ్కోలు పలికారు. వీరితోపాటు భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నాంగెల్ వాంగ్‌ఛుక్, అఫ్గాన్ రాజకీయ ప్రముఖుడు హమీద్ కర్జాయ్, బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రి అబ్దుల్ హసన్ మహమూద్, శ్రీలంక, నేపాల్ విదేశాంగ మంత్రులు లక్ష్మణ్ కిరియెల్లా, ప్రదీప్ గ్యావాలి, పాకిస్తాన్ తాత్కాలిక సమాచార మంత్రి సయద్ జఫర్ అలీ సహా సార్క్ దేశాల ప్రతినిధులు అంత్యక్రియల్లో పాల్గొని వాజ్‌పేయికి నివాళులర్పించారు. ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్, ప్రధాన కార్యదర్శి భయ్యాజీ జోషి, బీజేపీ అగ్రనేత మురళీ మనోహర్ జోషి, అకాలీదళ్ అగ్రనేత ప్రకాశ్ సింగ్ బాదల్, కాంగ్రెస్ నేతలు గులాంనబీ ఆజాద్, రాజ్‌బబ్బర్, జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తదితరులు కూడా అంత్యక్రియలకు హాజరయ్యారు. బంగ్లాదేశ్ ముక్తి పోరాటానికి వాజ్‌పేయి ఇచ్చిన మద్దతును, చేసిన సహాయాన్ని మరిచిపోలేమని ఆ దేశ విదేశాంగ మంత్రి పేర్కొన్నారు. పార్టీ కార్యాలయంలో నివాళులు అంతకుముందు, శుక్రవారం ఉదయం 10 గంటల వరకు కృష్ణ మీనన్ మార్గ్‌లోని వాజ్‌పేయి నివాసంలో ఆయన పార్థివదేహానికి అభిమానులు, కమ్యూనిస్టులు సహా వివిధ పార్టీల నేతలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పుష్పాంజలి ఘటించారు. ఐదు కిలోమీటర్ల దూరం చేరుకునేందుకు దాదాపు గంట పట్టింది. 11 గంటల సమయంలో ఆయన పార్థివ దేహాన్ని దీన్‌దయాళ్ మార్గ్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్ షా, కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్, సుష్మాస్వరాజ్, తదితరులు ఉదయాన్నే పార్టీ కార్యాలయానికి చేరుకుని పార్థివదేహం కోసం గేటు వద్ద వేచి చూశారు. అనంతరం పార్టీ హాల్లో రెండున్నర గంటలపాటు కార్యకర్తల సందర్శనార్థం ఉంచారు. ఇక్కడ కూడా ప్రధాని సహా పలువురు పార్టీ ప్రముఖులు నివాళులర్పించిన అనంతరం కార్యకర్తలను లోపలకు అనుమతించారు. కార్యాలయం వెలుపల రెండు పెద్ద ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటుచేసి ప్రత్యక్షప్రసారాన్నందించారు. వేల సంఖ్యలో కార్యకర్తలు ఢిల్లీతోపాటు చుట్టుపక్కల ప్రాంతాలనుంచి తరలిరావడంతో పార్టీ కార్యాలయం ఇసుకేస్తే రాలనంత జనంతో నిండిపోయింది. బీజేపీ ప్రధాన కార్యాలయంలో సీపీఐ నేత డి. రాజా, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ, బిహార్ సీఎం నితీశ్ కుమార్ తదితర నేతలు వాజ్‌పేయికి నివాళులర్పించారు. మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతంలో కార్యకర్తలు, అభిమానుల సందర్శనను నిలిపివేసి అంతిమయాత్రను ప్రారంభించారు. ఉక్కపోతగా ఉన్నా.. పుష్పాలతో అలంకరించిన గన్ క్యారేజ్ వాహనంపై వాజ్‌పేయి పార్థివదేహం ఉన్న బాక్స్‌ను ఉంచారు. దీనికి ఆర్మీ వాహనంతో అనుసంధానం చేసిన తర్వాత పార్టీ కార్యాలయం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. వాతావరణం ఉక్కపోతగా ఉన్నప్పటికీ వేల మంది అంతిమయాత్రలో పాల్గొన్నారు. కృష్ణ మీనన్ మార్గ్ సహా యాత్ర కొనసాగే మార్గాలన్నింటినీ ఓవైపు వాహనాలను అనుమతించి రెండోవైపు యాత్రకోసం ఖాళీగా ఉంచారు. దీన్ దయాళ్ మార్గ్ నుంచి ఐపీ మార్గ్, బహదూర్షా జఫర్ మార్గ్, ఢిల్లీ గేట్, నేతాజీ సుభాష్ మార్గ్, నిషాద్రజ్ మార్గ్, శాంతివన్, రాజ్‌ఘాట్ మీదుగా రాష్ట్రీయ స్మృతి స్థల్ వరకు అంతిమయాత్ర కొనసాగింది. స్మృతిస్థల్‌కు చేరుకునేందుకు రెండున్నర గంటలు పట్టింది. 4 గంటలకు అంత్యక్రియలు ప్రారంభం కావాల్సి ఉన్నా ఆలస్యమై.. ఐదున్నరకు పూర్తయ్యాయి. ‘ఇండియా సెల్యూట్స్ అటల్జీ’ అని మోదీ ట్వీట్ చేశారు. సూరత్‌లో మాజీ ప్రధానికి నివాళులర్పిస్తున్న గురుకుల పాఠశాల విద్యార్థులు మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
‘వాజ్‌పేయి ఆరోగ్య శ్రీ’ జిందాబాద్
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి పేరు పెట్టినందుకో, మరెందుకోగానీ కర్ణాటక రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ రాష్ట్రంలోని ‘వాజ్‌పేయి ఆరోగ్య శ్రీ’ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తోంది. ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పేదల పెన్నిదిగా ఈ పథకం సవ్యంగా అమలు జరుగుతోంది. 2010లో అప్పటి బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఈ ఆరోగ్య పథకాన్ని ప్రారంభించిన నాటి నుంచి ఇది వేలాదిమంది పేద ప్రజలకు ప్రాణభిక్ష పెట్టింది. కర్ణాటక పేద ప్రజలను ఎక్కువగా పీడిస్తున్న క్యాన్సర్, గుండె జబ్బుల వైద్యం కోసం ఇల్లూ వాకిలి అమ్ముకునే పరిస్థితి నుంచి వారిని కాపాడుతూ వస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువనున్న (బీపీఎల్) పేద ప్రజలందరికి ఈ స్కీమ్ కింద ఉచితంగా వైద్య సేవలు బేషుగ్గా అందుతున్నాయి. అంటే బీపీఎల్ కార్డులున్న వారందరికి ఈ ఆరోగ్య శ్రీ కార్డులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని ఆరోగ్య ట్రస్టు పరిధిలో నడుస్తున్న ఈ పథకాన్ని ప్రశంసిస్తూ ‘బీఎంజే గ్లోబల్ హెల్త్’ గతేడాదే ఓ నివేదికను విడుదల చేసింది. ఈ స్కీమ్ లేనివారితో పోలిస్తే ఈ స్కీమ్ కలిగిన వారు 40 శాతానికిపైగా ఆస్పత్రుల్లో చేరి వైద్యం చేయించుకుంటున్నారు. ఈ స్కీమ్ లేకుండా తీవ్రమైన జబ్బులకు గురైన వారి సంఖ్యతో పోలిస్తే వారిలో ఈ స్కీమ్ లబ్ధిదారులు 35 శాతానికన్నా తక్కువగా ఉన్నారు. అంటే, స్కీమ్ లబ్ధిదారులు ప్రాథమిక దశలోనే ఆస్పత్రులకు వెళ్లి చికిత్స చేయించుకోవడం వల్ల వారిలో ఎక్కువ మంది తీవ్రమైన జబ్బుల బారిన పడలేదు. స్కీమ్ పరిధిలోకి రానివారిలో క్యాన్సర్, గుండె జబ్బుల కారణంగా 0.90 శాతం మరణిస్తే ఈ స్కీమ్ లబ్ధిదారుల్లో 0.30 శాతం మంది మాత్రమే మరణించారు. స్కీమ్ పరిధిలోకి రానివారు ఆస్పత్రుల్లో చేరాక ఇన్ఫెక్షన్లు వచ్చిన వారిలో ఈ స్కీమ్ లబ్ధిదారులు 88 శాతం మంది తక్కువగా ఉన్నారు. అంటే, స్కీమ్ పరిధిలో లేని వారికి నూటికి నూరు శాతం ఇన్ఫెక్షన్లు వచ్చాయనుకుంటే స్కీమ్ లబ్ధిదారుల్లో 12 శాతం మందికే ఇన్ఫెక్షన్లు వచ్చాయన్నమాట. వాజ్‌పేయి ఆరోగ్య శ్రీ పథకం కేసుల్లో 86.7 శాతం కేసులు సముచితమైనవి కాగా, 3.7 శాతం కేసులు మాత్రమే అనుమానాస్పదమైనవని బీఎంజే గ్లోబల్ హెల్త్ తన నివేదికలో వెల్లడించింది. ఈ స్కీమ్ కింద సాధారణంగా ఏడాదికి లక్షన్నర రూపాయలను, కొన్ని అసాధరణ కేసుల్లో రెండు లక్షల రూపాయలను బీమాగా ఖర్చు పెడుతున్నారు. రోగులు తమ ఇంటి నుంచి, తమ ఊరు నుంచి ఆస్పత్రికి వచ్చేందుకు అయ్యే ఖర్చులను కూడా ట్రస్టు భరిస్తోంది. జిల్లాలోని ప్రతి మండలం స్థాయిలోనే కాకుండా ట్రస్టు సూచించిన పట్టణం లేదా గ్రామంలో ప్రతివారం నెట్వర్క్ ఆస్పత్రులు ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పేద ప్రజల ఆరోగ్యాలను సమీక్షిస్తున్నాయి. ఈ స్కీమ్ ఇంతగా విజయం సాధించడానికి కారణం ప్రైవేటు భీమా కంపెనీలకు అప్పగించకుండా ప్రభుత్వ ట్రస్టు ఆధ్వర్యంలో నడవడమేనని పలు పరిశోధనా సంస్థలు అభిప్రాయపడ్డాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అమలు చేయనున్న ఐదు లక్షల రూపాయల ఆరోగ్య భీమా పథకం అమలును ప్రైవేటు భీమా కంపెనీలకు అప్పగించాలా? లేదా స్వచ్ఛంద సంస్థల ట్రస్టులకు అప్పగించాలా? అని రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను కోరింది. వాజ్‌పేయి ఆరోగ్య శ్రీని అమలు చేస్తున్న ప్రభుత్వ ట్రస్టును ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుందేమో! -
తలవంచని కవి
కవిగా, రాజకీయవేత్తగా వాజ్‌పేయి ధోరణి అదే. తల వంచని ధోరణి. తలపడే ధోరణి. శిథిల స్వప్నాల నిట్టూర్పు ఎవరు వింటారు.. కనురెప్పలపై తారాట్లాడే వ్యథను ఎవరు కంటారు.. వద్దు.. ఓటమి వొప్పుకో వద్దు పాడుతూనే ఉందాం కొత్తపాట.. తన ఉపన్యాసాలతో మాటలతో చేతలతో కూడా ఇలాంటి స్ఫూర్తినే వాజ్‌పేయి ఎప్పుడూ ఎదుటివారిలో నింపుతూ వచ్చారు. వాజ్‌పేయి తనను తనలోని కవిని ఎంత నిరాడంబరంగా ఉంచాలనుకున్నారంటే తాను ప్రధాని అయినప్పుడు తన పరిస్థితిని శిఖరంతో పోలుస్తూ ‘శిఖరం ఒంటరిది... ఎవరూ రారు హత్తుకోవడానికి... అధిరోహించడానికి బాగుంటుంది... కాని తోడు నిలవడానికి ఒక్కరూ ఉండరు’అని రాశారు. ‘ఒకనాటికి నేను మాజీ ప్రధానిని కావచ్చు... కాని మాజీ కవిని మాత్రం కాలేను’అని తన శాశ్వత కవి హోదాను చూసి పొంగిపోయారాయన. ♦ ‘నడి మధ్యాహ్నామే నిశి ఆవరించింది ♦ సూర్యుడు తన నీడచే పరాజితుడయ్యాడు. ♦ నీ హృదయాన్నే వత్తిగా చేసి దీపాన్ని వెలిగించు ♦ తోడు మరిన్ని దీపాలు వెలిగించేందుకు కదిలిరా’... అంటూ రాశారాయన. ♦నన్ను క్షణక్షణం జీవించనీ... కణకణంలోని సౌందర్యాన్ని జుర్రుకోని’అని రాసిన వాజపేయి జీవితాన్ని ధనాత్మకమైన కానుకలా పరిగణిస్తూ అలా జీవించడానికే ఇష్టపడ్డారు. ♦ చావు ఆయుష్షు ఎంత? రెండు క్షణాలు’అన్న వాజపేయి ‘జీవితమన్నది ప్రగతిశీలం. అది ఒకటి రెండు రోజుల్లో ముగిసిపోదు’అని హితవు చెప్పారు. ♦ అంతిమంగా మృత్యువు అనే కవితను ముద్దాడిన ఈ కవి చాలాకాలం తన కవిత్వంతో సజీవ పరిమళాలను వెదజల్లుతూనే ఉంటాడు. కవిగానే కాదు వక్తగా కూడా ఆయన మాటలతో చాలనం చేసేవారు. వాక్కును ఖడ్గంలా వాడేవారు. కవితాత్మకంగా సాగే ఆయన ప్రసంగాలను పార్లమెంటులో విపక్షాలు కూడా శ్రద్ధగా ఆలకించేవి. ఆయన కవిత్వం జాతీయవాదాన్ని ప్రేరేపించేది. మానవతా విలువల్ని పాదుకొల్పే విధంగా ఉత్తేజితం చేసేది. కవిత్వం ప్రజల్లో కర్తవ్యాన్ని తట్టిలేపాలని, సామాజిక బాధ్యతను గుర్తు చేయాలని వాజ్‌పేయి నమ్మేవారు. హిందూ పురణాల స్ఫూర్తి వాజ్‌పేయి కవితల్లో కనిపించేది. తేలిక పదాలతో, అందరికీ అర్థమయ్యేలా ఆయన రాసిన కవితలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, చరిత్రను, కీర్తి ప్రతిష్టలను ప్రస్తుతించడానికి పదం కలిపేవి. వాజ్‌పేయి కవితలను ఇంగ్లీషులోకి అనువదించిన భగవత్.ఎస్ గోయల్ వాజ్‌పేయి గురించి చెబుతూ, ‘వాజ్‌పేయి రాజకీయాలు, సాహిత్యం ఒకదాన్నొకటి సుసంపన్నం చేసుకుంటాయి. ఒక సాహితీవేత్త రాజకీయాల్లోకి వస్తే రాజకీయాలు మరింత శుద్ధమవుతాయని ఆయన నిరూపించారు. సాహితీ నేపథ్యం ఉన్న రాజకీయవేత్త మానవ విలువల్ని ఉద్వేగాల్ని అలక్ష్యం చేయజాలడని వాజపేయి నమ్మేవారు’అన్నారు. ఆ మాటలు అక్షర సత్యాలని వాజ్‌పేయి కవితను, జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. జైలులో కవితా రచన వాజ్‌పేయికి పదాలతో ప్రతిస్పందన తెచ్చే విద్య పాత్రికేయుడిగా ఉన్న నాటి నుంచి ఉంది. హిందీ మాస పత్రిక రాష్ట్ర ధర్మ, హిందీ వారపత్రిక పాంచజన్య, దినపత్రిక స్వదేశ్, వీర్ అర్జున్‌లకు సంపాదకుడిగా వ్యవహరించారు. ఎమర్జెన్సీ సమయంలో జైలులో ఉన్నప్పుడు ‘ఖైదీ కవిరాజ్ కీ కుందలియా’పేరుతో కవితలు రాశారాయన. ఆ కవితలను 1994లో ‘అమర్ ఆగ్ హై’పేరుతో సంకలంగా తెచ్చారు. తన పార్లమెంటు జీవితంపై ‘మేరీ సన్సదీయ యాత్ర’పేరతో నాలుగు సంపుటాలు రచించారు. ‘మేరీ ఇక్కవాన్ కవితా’,‘సంకల్ప్ కాల్’, ‘శక్తి సే శాంతి’, ‘ఫోర్ డెకేడ్స్ ఇన్ పార్లమెంట్ (పార్లమెంటు ప్రసంగాలు),‘లోక్‌సభ మే అటల్జీ’(ప్రసంగాల సంకలనం),‘మృత్యు యా హత్య’, ‘అమర్ బలిదాన్’, ‘జన్‌సంఘ్ ఔర్ ముసల్మాన్’, ‘క్యా ఖోయా క్యా పాయా’, ‘కుచ్ లేఖ్..కుచ్ బాషన్’, ‘నయీ చునోతి– నయా అవసర్’తదితర రచనలు ఆయన కలం నుంచి జాలువారి అశేషసాహితీ ప్రియుల మనసులను దోచాయి. కుమరకోం మ్యూజింగ్స్ 2000 డిసెంబర్ 26 నుంచి 2001 జనవరి1 వరకు వాజ్‌పేయి కేరళలోని కుమరకోం రిసార్ట్స్‌లో గడిపారు.అక్కడ ఆయన మ్యూజింగ్స్ రాశారు. దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను తన మ్యూజింగ్స్‌లో ప్రస్తావించారు. ముఖ్యంగా కశ్మీర్ సమస్య, అయోధ్య వివాదాల గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు. గతం నుంచి వస్తున్న సమస్యలను పరిష్కరించడానికి, బంగరు భవిష్యత్తువైపు పయనించడానికి తగిన సమయం ఆసన్నమైందని ఆ మ్యూజింగ్స్‌లో పేర్కొన్నారు. బాలీవుడ్ గాయకుల నోట వాజ్‌పేయి పాట... అటల్ బిహారీ వాజపేయి రాసిన కవితల్లో కొన్నింటిని బాలీవుడ్ గాయకులు పాడారు. ఆ పాటలు కూడా విశేష జనాదరణ పొందాయి.వాటిలో కొన్ని.... క్యా ఖోయా క్యా పాయా ఈ కవితను స్వర్గీయ జగ్జీత్ సింగ్ ఆలపించారు.1999లో షారూక్ ఖాన్ మీద ఈ పాటను చిత్రీకరించారు. 19 ఏళ్ల తర్వాత ఇప్పుడు కూడా ఈ పాట ప్రజల మనసుల్లోంచి చెక్కు చెదరలేదు. జీవితంలో మనిషి ఎదుర్కొనే ఆటుపోట్లను వాజ్‌పేయి ఈ కవితలో చిత్రించారు. దూర్ కహి కోయి రోతా హై 2002లో వచ్చిన సంవేదన ఆల్బమ్‌లో ఈ పాటను జగ్జీత్ సింగ్ పాడారు. చావు, విషాదం, కన్నీళ్లు జీవితంలో ఒక భాగమని. సంతోషంలాగే ఇవి కూడా జీవితంలో సమానమేనని వాజ్‌పేయి ఈ కవితలో అందంగా వర్ణించారు. జుకీ న ఆంకే జగ్జీత్ సింగ్ నోట పలికిన ఈ పాట 1999లో విడుదలయింది. విషాదభరితమైన ఈ గీతంలో వాజ్‌పేయి తన భావాలను గుండెలకు హత్తుకునేలా చెప్పారు. ఆవో మన్‌కీ గతే ఖోలే వాజ్‌పేయి కలం నుంచి జాలువారిన ఈ గీతాన్ని లతా మంగేష్కర్ ఆలపించారు. గాన కోకిల ఆలపించిన ఈ గీతం ఆణిముత్యంగా నిలిచింది. అందం, వర్ణన, అనుభూతుల కలయిక అయిన ఈ పాట భావోద్వేగ భరితంగా ఉంటుంది. అటల్జీ చివరి చిత్రం ఇదే.. అటల్జీకి భారతరత్న ప్రకటించిన తర్వాత అవార్డును అందించేందుకు 2015లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ.. ఢిల్లీ ల్యూటెన్స్లోని కృష్ణమీనన్లో ఉన్న వాజ్‌పేయి బంగ్లాకు వెళ్లారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్ అటల్జీ అవార్డు అందుకుంటున్న ఫొటో బయటకు విడుదల చేసింది. అందులో వాజ్‌పేయి ముఖం తక్కువగా కనబడేలా జాగ్రత్తపడ్డారు. -
సుస్థిర సర్కారు కోసం
అది 1990ల కాలం... సంకీర్ణ రాజకీయాల్లో సంధి సమయం... 1996లో ఏర్పడిన అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం కేవలం 13 రోజులకే కుప్పకూలగా ఆ తర్వాత కొలువుదీరిన హెచ్.డి. దేవెగౌడ, ఐ.కె. గుజ్రాల్ ప్రభుత్వాలు కూడా కొంత కాలానికే పడిపోయాయి. ముఖ్యంగా 1996 నుంచి 1998 వరకు కేంద్రంలో రాజకీయ అనిశ్చితి చోటుచేసుకుంది. చిన్న కారణాలకే ప్రభుత్వాలు కుప్పకూలేవి. ఈ పరిణామాలపై వాజ్‌పేయి ఎంతో కలత చెందారు. ప్రభుత్వాల అస్థిరత ఆయన్ను కలవరపెట్టింది. దీంతో ఆయన ఎవరూ ఊహించని ప్రతిపాదన చేశారు. నేటి కాలానికి, ప్రస్తుత రాజకీయ వాతావరణ పరిస్థితులకు ఏమాత్రం సరిపడని ఆలోచనను తెరపైకి తెచ్చారు. దేశంలో రాజకీయ సుస్థిరత కోసం కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అనూహ్యంగా బయటి నుంచి మద్దతు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. అయితే ఇందుకు డాక్టర్ మన్మోహన్సింగ్ను ప్రధానిని చేయాలనే షరతు విధించారు. కానీ ఈ ప్రతిపాదన ఆదిలోనే ఆగిపోయింది. అందుకు దారి తీసిన పరిస్థితులు ఏమిటంటే.. ఈ ప్రతిపాదన గురించి తొలుత పార్టీలోని తన సహచరుడు, ఆప్తమిత్రుడైన ఎల్.కె. ఆద్వాణీతో వాజ్‌పేయి చర్చించారు. దేశ ఆర్థిక రంగాన్ని గాడినపెట్టేందుకు ‘బలమైన కేంద్ర ప్రభుత్వం’ఉండాలని, ఇందుకు ప్రధానిగా డాక్టర్ మన్మోహన్సింగ్ అయితే బాగుంటుందని వాజ్‌పేయి ప్రతిపాదించారు. 1991–92 దేశ ఆర్థిక సంస్కరణల విషయంలో మన్మోహన్సింగ్ చూపిన తెగువను వాజ్‌పేయి ఎంతగానో మెచ్చుకున్నారు. ముఖ్యంగా 1991 ఆర్థిక సరళీకరణల బడ్జెట్‌పై చర్చ సందర్భంగా వాజ్‌పేయి పలు అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ స్టాక్ మార్కెట్లకు ప్రపంచ ద్వారాలు తెరిచేందుకు మార్గం చేసిన మన్మోహన్పై మాత్రం ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. అందువల్ల మన్మోహన్ సారధ్యంలో స్థిరమైన కేంద్ర ప్రభుత్వం కొనసాగుతుందని వాజ్‌పేయి విశ్వసించారు. చివరకు ఈ ప్రతిపాదన గురించి మన్మోహన్‌కు తెలియజేసేందుకు తనకు అత్యంత సన్నిహితుడైన ఆర్.వి. పండిట్‌ను ఆంతరంగిక దూతగా పంపారు. అయితే ‘ఇందుకు కాంగ్రెస్ ఏమాత్రం అంగీకరించదు’అంటూ మన్మోహన్ పేర్కొనడంతో ఈ ప్రతిపాదనకు అక్కడితో తెరపడింది. ఈ పరిణామాల గురించి ఆర్.వి. పండిట్ ఆ తర్వాతి కాలంలో ఓ జాతీయ దినపత్రికలో రాసుకొచ్చారు. కాగా, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వాజ్‌పేయి ఎన్డీయే కూటమిని ఏర్పాటు చేసి గద్దెనెక్కినా ఆయన ప్రభుత్వం 13 నెలలపాటే కొనసాగింది. తదనంతరం జరిగిన ఎన్నికల్లో మాత్రం ఎన్డీయే ఐదేళ్లపాటు అధికారంలో కొనసాగింది. -
స్టెప్పులేసిన వాజ్‌పేయి
-
క్రిస్మస్ సెలవు రద్దు
సాక్షి, చెన్నై: క్రిస్మస్ పర్వదినం రోజున సెలవును రద్దు చేస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ తీసుకున్న చర్యలు వివాదానికి దారి తీస్తున్నారుు. క్రైస్తవ సామాజిక వర్గానికి అత్యంత పవిత్రమైన రోజున సెలవు రద్దు చేయడాన్ని తమిళనాడులోని రాజకీయ పక్షాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. కేంద్రం తీరును దుయ్యబట్టాయి. సెలవు రద్దు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఏసు క్రీస్తు జన్మదినం క్రిస్మస్. ఈ రోజును అత్యంత పవిత్రంగా ప్రపంచంలోని క్రైస్తవులందరూ భావిస్తారు. ఈ పర్వదినం జాతీ య సెలవు దినం. అయితే, కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టిన బీజేపీ ప్రభుత్వం ఈ సెలవును రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం వివాదాస్పదం అవుతోంది. ఈనెల 25న మాజీ ప్రధాని వాజ్‌పేయ్, హిందూ మహా సభ నేత మదన్ మోహన్ మాల్యా జన్మదినం కూడా కావడంతో ఆ ఇద్దరికి ప్రాధాన్యతను ఇస్తూ కేంద్ర మానవ వనరుల శాఖ నిర్ణయం తీసుకోవడం చర్చకు దారి తీసింది. ఆ రోజును మంచి రోజుగా భావించి పాఠశాలల్లో వాజ్‌పేయ్, మదన్మోహన్ మాల్యా జీవిత గాథలకు సంబంధించి వక్తృత్వ, వ్యాస రచన పోటీలను విద్యార్థులకు నిర్వహించాలని మాన వనరుల శాఖ ఆదేశాలు జారీ చేయటం వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా సీబీఎస్ఈ, నవోదయ స్కూళ్లకు తప్పని సరిగా సెలవురద్దుతోపాటుగా పోటీలు నిర్వహించాలని ఉత్తర్వులు వెలువడడాన్ని తమిళనాడులోని రాజకీయపక్షాలు తీవ్రంగా పరిగణించాయి. అత్యంత పవిత్రంగా భావించే క్రిస్మస్ పర్వదినాన సెలవు రద్దు చేయడం వివాదానికి దారి తీస్తోంది. వివాదం : రాష్ట్రంలో క్రైస్తవ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు అత్యధికంగానే ఉన్నారు. సీబీఎస్ఈ, నవోదయ స్కూళ్లల్లో ఆ సామాజిక వర్గం పిల్లలు చదువుకుంటున్నారు. సెలవు రద్దు సమాచారంతో క్రైస్తవ సామాజిక వర్గ సంఘాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది కేంద్రం తీరును ఆ సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఇక ఎండీఎంకే నేత వైగో కేంద్రం తీరుపై శివాలెత్తారు. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబరు 25ను సెలవు దినంగా పాటిస్తుంటే, కేంద్రం మాత్రం ఆ సెలవును సీబీఎస్ఈ, నవోదయ తదితర కేంద్రీయ స్కూళ్లకు రద్దు చేయడం విచారకరంగా పేర్కొన్నారు. అన్ని మతాలను సమానంగా చూడాల్సిన కేంద్రం తన మత స్వరూపాన్ని చాటుకునే పనిలో పడిందని ధ్వజమెత్తారు. తన నిర్ణయాన్ని కేంద్రం ఉప సంహరించుకోని పక్షంలో తీవ్ర పరిణామాల్ని చవి చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు. క్రైస్తవులకు అత్యంత పవిత్ర దినంగా ఉన్న క్రిస్మస్ను వివాదం చేస్తూ, తమ స్వలాభం కోసం వాడుకునే రీతిలో కేంద్రం ముందుకు సాగుతోందని మండిపడ్డారు. ఈలం తమిళుల విషయంలో, తమిళ జాలర్ల విషయంలో కేంద్రం వ్యవహరించిన తీరు మరువక ముందే, తాజాగా క్రిస్మస్ సెలవు రద్దు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ పేర్కొంటూ, తన మతతత్వ స్వరూపాన్ని చాటుకునే విధంగా కేంద్రంలోని పాలకులు ముందుకు సాగుతున్నారని మండి పడ్డారు. నిన్నటికి నిన్న మంత్రులు, ఎంపీలు మైనారిటీలకు వ్యతిరేకంగా, మహాత్మా గాంధీకి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తూ దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారని మండి పడ్డారు. ఈ సమయంలో క్రిస్మస్ సెలవును రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం తీవ్రంగా ఖండించదగ్గ విషయంగా పేర్కొన్నారు. మైనారిటీ ప్రజలకు వ్యతిరేకంగా కేంద్రం తన దూకుడును ప్రదర్శించేందుకు సిద్ధమవుతోందని మండి పడ్డారు. ఆ ప్రజల మనో భావాలకు అనుగుణంగా నడుచుకోకుంటే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. కేంద్ర సిలబస్ ఉన్న పాఠశాలలకు పంపిన ఉత్తర్వుల్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరుణ ఆగ్రహం క్రిస్మస్ సెలవు రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిసూత డీఎంకే అధ్యక్షడు కరుణానిధి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీజేపీ ప్రభుత్వ చర్యలు నానాటికీ పెచ్చుమీరుతున్నాయని మండి పడ్డారు. ఆ ప్రభుత్వ తీరు ఆవేదన కలిగిస్తోందన్నారు. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాల్సిన అవసరం ఉంద ని హితవు పలికారు. అయితే, మతపరంగాను, భాషాపరంగాను ఏకపక్ష ధోరణి అనుసరించడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. క్రైస్తవులు ఏడాదికి ఒక సారి జరుపుకునే పండుగను సైతం అడ్డుకునే రీతిలో కేంద్రం చర్యలు ఉన్నాయని మండిపడ్డారు.