ధనుష్‌తో జత కుదిరింది | Dhanush, Balaji Mohan, Kajal Agarwal new movie rolls on | Sakshi
Sakshi News home page

ధనుష్‌తో జత కుదిరింది

Published Fri, Nov 7 2014 3:15 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

ధనుష్‌తో జత కుదిరింది - Sakshi

ధనుష్‌తో జత కుదిరింది

ఒక్కసారి మిస్ అయిన చాన్స్ మళ్లీ చేతికందితే పొందే ఆనందమే వేరు. ప్రస్తుతం నటి కాజల్ అగర్వాల్ అలాంటి సంతోషంతోనే ఎగిరి గంతేస్తోంది. ఈ బ్యూటీకి తెలుగులో ఒకటి అర అవకాశాలున్నా తమిళంలో జిల్లా చిత్రం తరువాత అవకాశాలు ముఖం చాటేశాయి. కారణం స్వయం కృతాపరాధమేనంటున్నాయి సినీ వర్గాలు. ఒకపక్క బాలీవుడ్ మోహంలో పడటం, పారితోషికాన్ని అమాంతం పెంచేయడం లాంటి విషయాల కారణంగా అవకాశాలు తగ్గుముఖం పెట్టాయంటున్నారు సినీ విజ్ఞులు. ఇలాంటి పరిస్థితిలో కాజల్ అగర్వాల్‌కు తమిళంలో నటుడు ధనుష్‌తో జతకట్టే అవకాశం వచ్చింది. మరో విషయం ఏమిటంటే ఈ నటుడితో కాజల్ అగర్వాల్ తొలి రోజుల్లోనే పొల్లాదవన్ చిత్రంలో నటించాల్సింది.
 
 అనివార్య కారణాల వలన ఆ అవకాశం మిస్ అయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు అలాంటి అవకాశం మళ్లీ వరించింది. వేలై ఇల్లా పటప్టాదారి చిత్రం సక్సెస్‌తో జోరు మీదున్న ధనుష్ ప్రస్తుతం హిందీ చిత్రం షమితాబ్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. అదే విధంగా తాను నటించిన తాజా తమిళ చిత్రం అనేగన్ విడుదల కోసం ఎదురు చూస్తున్నారు. తన తదుపరి చిత్రం బుధవారం ప్రారంభమైంది. బాలాజీ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలోనే కాజల్ అగర్వాల్ ధనుష్‌తో జతకడుతోంది. ఈ చిత్రంలో ఈ అమ్మడి పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందట. దీంతో ఈ చిత్ర షూటింగ్‌లో ఎప్పుడెప్పుడు పాల్గొంటానా అని ఆతృతగా ఎదురుచూస్తోందట.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement