కూతురు చేసిన పనికి కుటుంబం ఆత్మహత్య | Farmer Family Commit Suicide After Daughter Married Lover | Sakshi
Sakshi News home page

కూతురు చేసిన పనికి కుటుంబం ఆత్మహత్య

Published Sun, Aug 6 2017 8:12 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

కూతురు చేసిన పనికి కుటుంబం ఆత్మహత్య - Sakshi

కూతురు చేసిన పనికి కుటుంబం ఆత్మహత్య

► ప్రియుడితో వెళ్లిపోయిన పెద్ద కుమార్తె
► ఇద్దరు పిల్లలతో సహా తల్లిదండ్రుల బలవన్మరణం


తమిళనాడు: పెద్ద కుమార్తె ప్రియుడితో వెళ్లిపోవడంతో పరువుపోయిందని భావించి మరో ఇద్దరు పిల్లలతో కలసి తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన తమిళనాడు, సేలం జిల్లాలో ఆదివారం కలకలం రేపింది. ఏత్తాపూర్‌ సమీపంలో తాండానూర్‌ వెస్ట్‌ కాట్టుకొట్టాయ్‌ ప్రాంతానికి చెందిన రైతు రాజేంద్రన్‌ (46)కు భార్య రాణి (40), ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె మోహన బీఏ పూర్తి చేసింది. రెండో కుమార్తె ఆర్తి (18) బీఏ చదువుతోంది. కుమారుడు నవీన్‌కుమార్‌ (16) ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. మోహన వారి దూరపు బంధువైన యువకుడిని ప్రేమించినట్లు సమాచారం.

ఈనేపథ్యంలో ఈ నెల 3న మోహన ప్రియుడి కోసం ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో పరువుపోయిందని భావించిన రాజేంద్రన్‌ తీవ్ర ఆవేదనకు గురై రెండు రోజులుగా దిగాలుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం పక్క ఇంటిలో ఉన్న రాజేంద్రన్‌ బంధువు కుమార్తె శశికళ ఇంటిలోకి రాగా అక్కడ రాజేంద్రన్, రాణి, ఆర్తి, నవీన్‌ నలుగురూ మృతి చెంది ఉన్నారు. సమాచారం అందుకున్న తాండానూర్‌ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. వారంతా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. పోలీసులు వారి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సేలం జీహెచ్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement