న్యూఢిల్లీ: ఓఖ్లాలోని హోలీ ఆస్పత్రి త్వరలో విద్యుత్ ఇబ్బందులనుంచి బయటపడనుంది. ఇందుకు కారణం ఈ ఆస్పత్రి పై అంతస్తులో 300 కిలోవాట్ల సామర్థ్యం కలిగిన సౌరవిద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుండడమే. 350 పడకలు, 200 ఎయిర్ కండిషనర్లు, తొమ్మిది శస్త్రచిక్తిత్స థియేటర్లు, ఐదు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు, వెయ్యి బల్బులతోపాటు ఇతర అనేక విద్యుత్ పరికరాలను వినియోగిస్తోన్న ఈ ఆస్పత్రికి పారిశ్రామికవాడతోపాటు ఇతర ప్రాంతాలనుంచి రోగులు వైద్యసేవల కోసం వస్తుంటారు. సౌరవిద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి ఈ ఆసుపత్రికి ప్రభుత్వం తరఫున ఎటువంటి రాయితీ వచ్చే అవకాశం లేకపోయినప్పటికీ విద్యుత్ బిల్లులను తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తోంది. మార్కెట్‌లోకి చైనాలో తయారైన సోలార్ ప్యానళ్లు వ రద మాదిరిగా వస్తున్నప్పటికీ ఈ ఆస్పత్రి యాజమాన్యం జర్మనీలో తయారైన పరికరాల కొనుగోలుపై ఆసక్తి కనబరుస్తోంది. ఇవి దీర్ఘకాలం మన్నుతాయని, అంతేకాకుండా నిర్వహణ వ్యయంతక్కువగా ఉంటుందని ఆస్పత్రి యాజమాన్యం భావిస్తోంది.
హోలీ ఫ్యామిలీ ఆస్పత్రికి సౌర విద్యుత్
Published Tue, Feb 10 2015 12:39 AM | Last Updated on Thu, Apr 4 2019 5:24 PM
Advertisement