క్వీన్‌గా నటించాలని ఉంది | Rakul Preet Singh's Dream Role! | Sakshi
Sakshi News home page

క్వీన్‌గా నటించాలని ఉంది

Published Mon, Jul 27 2015 2:11 AM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

క్వీన్‌గా నటించాలని ఉంది - Sakshi

క్వీన్‌గా నటించాలని ఉంది

క్వీన్‌నవ్వాలన్నది తన డ్రీమ్ అంటోంది నటి రకుల్‌ప్రీతి. కోలీవుడ్‌లో వర్ధమాన హీరోలతో రెండు మూడు చిత్రాల్లో నటించినా విజయాలు చేరువకాకపోవడంతో టాలీవుడ్‌పై దృష్టి సారించిన ఈ ఉత్తరాది బ్యూటీకి అక్కడ అదృష్టం తేనెతుట్టెలా పట్టింది. సమంత, కాజల్ అగర్వాల్ వంటి టాప్ హీరోయిన్ల కోలీవుడ్ బాట పట్టడంతో రకుల్‌ప్రీతి టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అ యిపోయింది. యువ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, అల్లుఅర్జున్‌ల సరసన నటిస్తూ రకుల్ తెగ బిజీ అయిపోయింది. రవితేజతో నటించిన కిక్ 2 చిత్రం త్వరలో తెరపైకి రానుంది. తదుపరి అల్లుఅర్జున్‌తో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్న రకుల్‌ప్రీతి తన డ్రీమ్‌రోల్ ఏమిటన్న ప్రశ్నకు హిందీ చిత్రం క్వీన్‌లో కంగనారౌత్ పోషించిన పాత్రలాంటిది చెయ్యాలన్నది తన డ్రీమ్ అని టక్కున చెప్పిం ది.
 
  స్త్రీ భావాలను ఆవిష్కరించిన చిత్రం క్వీన్ అ ని ఆ చిత్రం ప్రజాదరణ పొందడమే కాకుండా అందులో కథానాయికిగా నటించిన కంగనారౌత్ జాతీయ అవార్డును తెచ్చిపెట్టిందని పేర్కొంది. ఆ చిత్రంలోని హీరోయిన్ పాత్ర తనను బాగా ఆకట్టుకుందని అంది. అలాంటి పాత్రల్లో నటిం చాలన్న తన డ్రీమ్ అని అంది.  క్వీన్ చిత్ర దక్షిణాది హక్కులు సీనియర్ నటుడు, నిర్మాత త్యాగరాజన్ చేతిలో ఉన్నా యి. ఇందులో నటించమని నటి స మంతను అడగ్గా హిందీలో విజ యం సాధించిన చిత్రాలు దక్షిణాది లో సక్సెస్ అవుతాయని గ్యారెంటీ ఉండదని నిరాకరించినట్లు ప్రచా రం జరిగింది. మరి తన డ్రీమ్ రో ల్ అంటున్న రకుల్‌ప్రీతి గోడు త్యాగరాజన్ ఆలకిస్తారా? అన్నది వేసిచూడాల్సిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement