టీటీడీ పాలకమండలి సమావేశం ప్రారంభం
Published Tue, Dec 20 2016 10:46 AM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM
తిరుమల: టీటీడీ పాలకమండలి సమావేశం మంగళవారం సమావేశమైంది. స్థానిక అన్నమయ్య భవనంలో ఉదయం 10.30 గంటలకు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి బోర్డు సభ్యులతో పాటు, టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పెద్దనోట్లు రద్దు అయిన తర్వాత తిరుమలకు వచ్చే భక్తులకు ఏ ఇబ్బందులు లేకుండా తీసుకున్న చర్యలపై అధికారులు వివరణ ఇవ్వనున్నారు.
అలాగే టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్ రెడ్డి ఇంట్లో ఐటీ దాడులు చేసి భారీగా నోట్ల కట్టలు దొరకడం, ప్రభుత్వం వెంటనే శేఖర్‌రెడ్డిని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపైన కూడా ప్రధాన చర్చ జరగనున్నట్లు సమాచారం. కొత్త సంవత్సరం వేడుకలకు వచ్చే భక్తులకు ఏర్పాట్లు, వైకుంఠ ఏకాదశి, సైన్స్ కాంగ్రెస్‌కు వచ్చే వీవీఐపీలకు దర్శనం ఏర్పాట్లపై ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Advertisement
Advertisement