టీటీడీ పాలకమండలి కీలక నిర్ణయాలు
Published Tue, Dec 20 2016 2:50 PM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM
తిరుమల: టీటీడీ పాలకమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్థానిక అన్నమయ్య భవనంలో ఉదయం 10.30 గంటలకు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో టీటీడీ పాలకమండలి సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి బోర్డు సభ్యులతో పాటు, టీటీడీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమావేశంలో పలు విషయాలపై నిశితంగా చర్చించి మండలి సభ్యులు నిర్ణయాలు తీసుకున్నారు. అనంతరం చైర్మన్ చదలవాడ మీడియాతో మాట్లాడారు. స్మార్ట్ సిటీ తిరుపతి అభివృద్ధికి టీటీడీ ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆయన తెలిపారు. వకూళామాత ఆలయం నిర్మాణం చేపడతామన్నారు.
టీటీడీ పాలకమండలి తీసుకున్న నిర్ణయాలివే..
- ఏర్పేడు నుండి కాలేరు వరకు నూరు అడుగుల రోడ్డు విస్తరణ, సుందరికరణ
- 86 లక్షలతో కొబ్బరి కాయలు కొనుగోళ్ళకు ఆమోదం
- 10 కోట్లతో తిరుపతి రోడ్లు సుందరికరణ
- జీడిపప్పు కొనుగోళ్ళకు రూ. 9.34 కోట్లు కేటాయింపు
- రూ. 6.3 కోట్లుతో మూడు నెలలకు సరిపడిన బియ్యం కోనుగోళ్ళు
- 176 మంది పోటు కార్మికుల కాంట్రాక్టు పొడిగింపు
- రూ. 4.7 కోట్లతో పలమనేరు వద్ద గోశాల నిర్మాణం
- పిఠాపురం వద్ద రూ. 2.7 కోట్లుతో వేంకటేశ్వర స్వామి ఆలయం పునరుద్ధరణ
- 150 మంది డ్రైవర్ లకు జీతం పెంపు
- క్షురకులకు ఫీస్ రేటును రూ.11 కు పెంపు
- టీటీడీ పై రూ. 4.5 కోట్లు అదనపు భారం
- 447 మంది అర్చకులు, పరిచారకుల పోస్టుల భర్తీకి ప్రభుత్వాన్ని అనుమతి కోరామని, ఉద్యోగుల ఇళ్ళ స్థలాలు సమస్యను పరిష్కరించేందుకు కమిటి ఏర్పాటు చేస్తామని చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి వివరించారు.
Advertisement