భారీగా నోట్లను మార్చుతూ బుక‍్కయ్యారు | two people custody in eluru over huge old currency exchanging | Sakshi
Sakshi News home page

భారీగా నోట్లను మార్చుతూ బుక‍్కయ్యారు

Published Mon, Nov 14 2016 5:17 PM | Last Updated on Sat, Sep 22 2018 7:51 PM

భారీగా నోట్లను మార్చుతూ బుక‍్కయ్యారు - Sakshi

భారీగా నోట్లను మార్చుతూ బుక‍్కయ్యారు

ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లాలో భారీ మొత్తంలో పెద్దనోట్లను మార్చే ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

వివరాల్లోకి వెళితే... విజయవాడకు చెందిన ఎనిమిది మంది వ్యక్తులు సోమవారం ఏలూరు పట్టణంలోని సోమవరప్పాడులోని ఓ బ్యాంకు వద్దకు వచ్చి నోట్లు మార్చేందుకు ఉన్న క్యూలో నిలబడ్డారు. వారి వంతు వచ్చేటప్పటికీ తమ బ్యాగులో ఉన్న పెద్ద మొత్తంలో నగదును క్యాషియర్ ఎదుట ఉంచారు. ఇది గమనించిన బ్యాంకు సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రూ.500, రూ.1000 నోట్ల కట్టలను లెక్కించగా రూ.24 లక్షలు ఉన్నట్లు తేలింది. దీనిపై ఏలూరు పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement