'ధాన్యానికి బోనస్ ప్రకటించాలి' | ysrcp leader jagadeshwar gupta demands over bonus for rice in telangana | Sakshi
Sakshi News home page

'ధాన్యానికి బోనస్ ప్రకటించాలి'

Published Thu, Nov 24 2016 6:26 PM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

'ధాన్యానికి బోనస్ ప్రకటించాలి' - Sakshi

'ధాన్యానికి బోనస్ ప్రకటించాలి'

సిద్దిపేట : ధాన్యానికి బోనస్ ప్రకటించి రైతులను ఆదుకోవాలని వైఎస్సార్‌సీపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు జగదీశ్వరగుప్తా ప్రభుత్వాన్ని కోరారు. దిగుబడులు తగ్గి రైతులు నిరాశలో ఉన్నారని, మద్దతు ధరకు అదనంగా వరి, మొక్కజొన్నకు రూ.200, పత్తి, సోయాబీన్‌కు రూ.500 బోనస్ ప్రకటించాలని డిమాండ్ చేశారు.

రైతులకు రబీ పంట రుణాలు అందకపోవడంతో విత్తనాల కొనుగోలుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పెద్ద నోట్ల రద్దు చేయడం వల్ల బయట కూడా రైతులకు అప్పు పుట్టని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. అందుకే రైతులకు పంట రుణాలను మంజూరు చేసి ఒకేసారి బ్యాంకు ఖాతాల నుంచి తీసుకొనే వెసులుబాటు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement