శంషాబాద్ : రోజుకో రకంగా బంగారం తెచ్చే వారిని చూస్తూ శంషాబాద్ విమానాశ్రయం అధికారులు కళ్లు తేలేస్తున్నారు. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా విదేశాల నుంచి వచ్చే విమాన ప్రయాణికులు బంగారం తెచ్చే విధానం రోజుకో తీరులో ఉంటోంది. షూల్లో, ఎలక్ట్రానిక్ పరికరాల్లో, చివరికి శరీరంలో దాచుకుని బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డ దాఖలాలు నిత్యం చూస్తున్నాం. అలాంటిదే తాజాగా మరో పద్ధతి వెలుగులోకి వచ్చింది.
మంగళవారం మధ్యాహ్నం దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టులో దిగిన ఓ యువకుడి లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. బ్యాగు లోపల వైరు కనిపించడంతో అనుమానం వచ్చిన అధికారులు నిశితంగా పరిశీలించారు. వైరు లోపలి భాగంలో 1,100 గ్రాముల బంగారం తీగలు బయటపడ్డాయి. ఆ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వైరులో బంగారు తీగలు..
Published Tue, Sep 8 2015 6:06 PM | Last Updated on Sun, Sep 3 2017 9:00 AM
Advertisement
Advertisement