హైదరాబాద్:తెలంగాణ రాష్ట్రంలో ఉన్న హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టులు, ట్రాన్స్ పోర్ట్ డ్రైవర్స్ కు ఈనెల నుంచే ప్రమాద బీమా వర్తింపు చేయనున్నట్లు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు.
ఈమేరకు ప్రభుత్వం నేషనల్ ఇన్సురెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు పేర్కొన్నారు. పాలసీ ప్రీమియంను ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఈ మూడు కేటగిరిల్లో 10 లక్షల మందికి లబ్ధి చేకూరనుందని నాయిని పేర్కొన్నారు.