సాక్షి, హైదరాబాద్ : పోలీసు విభాగంలో 3,620 ఆర్మ్‌డ్ రిజర్వు కానిస్టేబుల్ పోస్టులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది అందులో 2,315 పోస్టులు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు, 1,305 పోస్టులను సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు కేటాయించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ కానిస్టేబుల్ (డ్రైవర్) పేరుతో ఈ పోస్టులను ఏర్పాటు చేసింది. కానీ హైదరాబాద్, సైబరాబాద్ సిటీ యూనిట్లలో అటువంటి పోస్టులు లేవని డీజీపీ కార్యాలయం అభ్యంతరం తెలిపింది.
ఈ అంశాన్ని పరిశీలించిన రాష్ట్ర ఆర్థిక శాఖ గతంలో మంజూరు చేసిన పోస్టుల పేర్లను ఆర్మ్‌డ్ రిజర్వు పోలీస్ కానిస్టేబుల్‌గా మార్చినట్లు తాజా ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.
3,620 ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులు మంజూరు
Published Sat, Jun 27 2015 2:49 AM | Last Updated on Tue, Mar 19 2019 5:56 PM
Advertisement
Advertisement