ఊడ్చి.. ఊడ్చి మూలకు | broom in the market for various types of plastic, wipers | Sakshi
Sakshi News home page

ఊడ్చి.. ఊడ్చి మూలకు

Published Sun, Oct 19 2014 4:36 AM | Last Updated on Wed, Sep 26 2018 5:59 PM

ఊడ్చి.. ఊడ్చి మూలకు - Sakshi

ఊడ్చి.. ఊడ్చి మూలకు

* గతంలో ఇంటింటికీ ఉండేవి
* ఇంటి దేవతగానూ చూసేవారు
* ఊడ్చిన అతివలకు వ్యాయామం దొరికేది
* ఇపుడు వాకిళ్లు లేవు.. చీపురు కట్టలూ లేవు
* మార్కెట్‌లో రకరకాల ప్లాస్టిక్ చీపుర్లు, వైపర్లు

 కామారెడ్డి: గ్రామీణ ప్రాంతాలలో చీపురుకు తగిన గుర్తింపే ఉంది. ఇప్పటికీ గొప్పగానే చూస్తారు. ఆడపిల్ల రజస్వల అయినపుడు ఇంటి గడప వద్ద ఓ చీపురును ఉంచే సంప్రదా యం ఉంది. ప్రసూతి అయినపుడు కూడా చీపురుకట్టను గడప దగ్గర ఉంచుతారు. అంటే చీపురును ఇల్లు, వాకిలి ఊడ్చే సాధనంగానే కాకుండా, ఓ దేవతగా భావించే వారు. చీపురు కుటుంబంలో ఒక భాగంగా ఉండేది. ఏ ఇంటికి వెళ్లినా చీపురు కట్టలు ఎక్కడో ఒక చోట దర్శనమిచ్చేవి. ఆధునిక చీపుర్లు వచ్చిన తరువాత చీపురు కట్టలు మూలకు పడ్డాయనే చెప్పాలి. అక్కడక్కడా చీపురుకట్టలు దొరుకుతున్నా, వాటిని వాడడానికి మహిళలు ఆసక్తి చూపడం లేదు. దీంతో పాత కాలపు చీపురుకట్ట కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది.
 
అడవుల నుంచే చీపురు పుల్లల సేకరణ

చీపురు కొయ్యలు (పుల్లలు) అటవీ ప్రాంతాలు, కంచె లలోనే ఎక్కువగా లభిస్తాయి. వీటిని కోసుకువచ్చేవారు ప్రతీ గ్రామంలో ఉంటారు. కూలీలు వ్యవసాయ పనులు లేని సమయంలో అడవులు, కంచెలకు వెళ్లి చీపురు పుల్లలను కోసుకొచ్చి ఇంటి ముందరనో, ఇళ్లపైనో ఎండబెడుతారు. వాటి కొసలకు ముళ్లలాంటివి ఉంటాయి. రోజం తా తిరిగి పదిహేను ఇరవై చీపుర్లకు సరిపడా కొయ్యలు కోసుకొచ్చేవారు. నాలుగు రోజులు ఎండిన తరువాత పుల్లలను మడతలుగా పట్టుకుని కర్రతో కొడుతూ ముళ్లను తొలగిస్తారు. తరువాత పుల్లలను కట్టలుగా కడతారు. అడవుల నుంచి కోసుకొచ్చి కట్టిన చీపురు కట్టలు ఇప్పుడు కూడా మార్కెట్‌లో దొరుకుతున్నాయి. ఒక్కో చీపురును రూ. 15 విక్రయిస్తున్నారు. అయితే, మహిళలు వాటిని ఇష్టపడడం లేదు. ఆధునిక చీపుర్ల ధరలు అడ్డగోలుగా ఉన్నా వాటిపైనే ఆసక్తి చూపుతున్నారు.
 
చీపురుతో వ్యాయామం కూడా
తెలవారకముందే మహిళలు చీపురుకట్టతో అటూ, ఇటూ వాకిళ్లు ఊడుస్తూ ఉంటే వ్యాయామం కన్నా ఎక్కువ మేలు జరిగేది. మార్కెట్‌లో పొడవైన చీపురుకట్టలు, వై పర్లు వచ్చిన తరువాత మహిళలు ఎలాంటి శ్రమ లేకుండా ఊడ్చగలుగుతున్నారు. తద్వారా వారు శారీరక వ్యాయామం పొందలేకపోతున్నారు.
 
అంగట్లో ఆధునిక చీపుర్లు
మార్కెట్‌లో అన్ని వస్తువులలాగే చీపుర్లు కూడా రకరకాలవి తరలివచ్చాయి. ఇతర దేశాల నుంచి కూడా రకరకాల చీపుర్లు మార్కెట్ ను చుట్టేశాయి. కొబ్బరి తదితర చీపుర్లు మార్కెట్‌లో లభిస్తున్నాయి. అవి ఎక్కువ ఎత్తు ఉంటాయి. వంగకుండానే వాకిలి, ఇల్లు ఊడ్చుకోవచ్చు. దీంతో మహిళలు వాటిని వాడడానికే ఆసక్తి చూపుతు న్నారు. చీపురు కట్టలు నేటి తరం మహిళలకు నచ్చడం లేదు. పట్టణాలలోనే కాదు పల్లెలలో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది.
 
తెలతెలవారకముందే
తెల్లవారకముందే మహిళలు నిద్రనుంచి లేచి వాకిళ్ల వెంటపడేవారు. అప్పట్లో ప్రతీ ఇంటి ముందర ఇల్లంత వాకిలి ఉండేది. మహిళలు అందరూ ఒకే స మయంలో వరుసగా ఉంటే ఇళ్ల ముందర చీపురుతో ఊడుస్తుంటేతో ఓ రకమైన సంగీతం వెలువడేది. వాకిలి ఊడవడానికో చీపురు, ఇంటిలోపల ఊడవడానికో చీపురు ఉండేది.స్నా నపు గదులకు, వంటింటికి వేర్వేరుగా చీపురు కట్టలు ఉంచుకునేవారు. అంటే ఒక్కో ఇంటికి నాలుగైదు చీపుర్లు ఉండేవి. చీపురు కట్టల సీజన్ వచ్చిందంటే చాలు ఒక్కో ఇంటిలో పదుల సంఖ్యలో చీపురు కట్టలను జమచేసుకుని పెట్టేవారు. చీపురుకొయ్యలు కోసుకువచ్చిన వారు తమకు సరిపడా ఉంచుకుని మిగతావి అమ్ముకునేవారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement