లింగంపేట : మండలకేంద్రంలోని ప్రభుత్వ అటవీశాఖ కార్యాలయం ముందు గల ఖాళీ స్థలం విషయంలో ఆదివారం ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్వేనంబర్ 1065లో గల ఖాళీ స్థలంలో భవన నిర్మాణాల కోసం సంజీవరెడ్డి, రమేశ్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, సిద్దారెడ్డి, వంజరి ఎల్లమయ్య కలిసి పనులను ప్రారంభిస్తుండగా, స్థానికులు అబ్దుల్‌నయీం, ఎంఏ, షానూర్,ఆకుల సంగయ్య, జొన్నల రాజు,మాజీ సర్పంచి షేక్ మహిమూద్ తదితరులు అడ్డుకున్నారు.
దీంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై పలె ్లరాకేశ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను సముదాయించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ అటవీశాఖ కార్యాలయం ముందుగల ఖాళీ స్థలం గత 60 ఏళ్లుగా అటవీశాఖ ఆధీనంలో ఉండగా, 2006లో పిట్లరాజు,సాయవ్వ అనే వ్యక్తులు లింగంపేట జడ్పీటీసీ మాజీ సభ్యుడు సంజీవరెడ్డి,పోల్కంపేటకు చెందిన రమేశ్‌రె డ్డి,వర్గీయులకు విక్రయించాడు.కాగా వారు భవన నిర్మాణానికి అనుమతిని ఇవ్వాలని గ్రామ పంచాయతీకి దరఖాస్తు చేసుకున్నారు.
దీంతో గ్రామస్తులు అటవీశాఖ స్థలాన్ని కాపాడాలని ఆందోళనకు దిగారు.ప్రభుత్వ అటవీశాఖ కార్యాలయం సర్వే నంబర్ 1064లో ఉందని, తాము కొనుగోలు చేసిన భూమి సర్వే నంబర్ 1065లో ఉందని సంజీవరెడ్డి వర్గీయులు వాదిస్తుండగా, అటవీ శాఖ కార్యాలయం ముందుగల ఖాళీ స్థలం(సర్వే నంబర్ 1065లో కలభూమి) గతంలో పోకల భూమవ్వ అనే మహిళ అటవీ కార్యాలయానికి ఉచితంగా భూమిని ఇచ్చిందని, అలాంటి భూమిని పిట్లరాజు,సాయవ్వ లు ఎలా విక్రయిస్తారని గ్రామస్తులు, అఖిల పక్షనాయకులు ప్రశ్నిస్తున్నారు. జిల్లా ల్యాండ్ సర్వే అధికారులు పలుమార్లు సర్వే నిర్వహించి సర్వే నంబర్ 1065లో గల స్థలం సంజీవరెడ్డి వర్గీయులకే చెందుతుందని నిర్ధారించారు.
ల్యాండ్ సర్వే అధికారుల నివేదిక ప్రకారం రాష్ట్ర హైకోర్టు సైతం ఈ స్థలం సంజీవరెడ్డి వర్గీయులకే చెందుతుందని ఆదేశాలు జారీ చేసింది. విషయం తెల్సుకున్న స్థానిక అఖిల పక్ష నాయకులు సైతం 60 ఏళ్లుగా అటవీశాఖ కార్యాలయం ఆధీనంలో ఉన్న ఖాళీ స్థలాన్ని కాపాడాలని కోరు తూ హైకోర్టును ఆశ్రయించారు.ఈక్రమంలోనే ఆదివారం సంజీవరెడ్డి వర్గీయులు భవన నిర్మాణ పనులను పూనుకోగా స్థానికులు అడ్డుతగిలారు. దీంతో ఇరువర్గాల మద్య రెండు గంటలపాటు ఘర్షణ జరిగింది. ఎస్సై పల్లెరాకేశ్, తహశీల్దార్ పీవీఎల్ నారాయణ ఇరు వర్గాలను సముదాయించారు.
వచ్చే నెల 20వ తేదీన సమస్యను పరిష్కరించుకోవాలని వారు సూచించారు. భూమికి సంబంధించిన రికార్డులు,ఆధారాలను తీసుకువచ్చిన వారికే భూమి చెందుతుందని ఇరువర్గాలవారికి చెప్పగా, వారు అందుకు ఒప్పుకుని వెళ్లిపోయారు. ఆందోళనలో గ్రామ సర్పంచు బాలమణి,ఉపసర్పంచి అప్రోజ్,అఖిల పక్ష నాయకులు ఆకుల సంగయ్య,శేఖ్‌మహిమూద్,ఎంఏ,షానూర్, అబ్దుల్ నయీం,జొన్నల రాజు.ఆకుల రాములు,ఆశయ్య తదితరులు ఉన్నారు.
పోలీస్ పికెట్ ఏర్పాటు
మండలకేంద్రంలోని అటవీశాఖ కార్యాలయం ముందుగల ఖాళీ స్థలంవద్ద స్థానిక పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు.స్థలం కొనుగోలు చేసిన సంజీవరెడ్డి వర్గీయులకు,అఖిలపక్ష నాయకుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఎస్సై పల్లెరాకేశ్ ముందస్తు చర్చలలో భాగంగా పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
‘అటవీశాఖ స్థలం’పై ఆందోళన‘అటవీశాఖ స్థలం’పై ఆందోళన
Published Mon, Dec 22 2014 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 6:32 PM
Advertisement
Advertisement