హైదరాబాద్: పార్టీ ఫిరాయింపుదారులను ఇరుకునపెట్టేందుకు కాంగ్రెస్ వ్యూహం పన్నింది. నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే. తెలంగాణ శాసనసభలో శుక్రవారం ద్రవ్య బిల్లు చర్చకు రానుంది. ఈ బిల్లుపై కాంగ్రెస్ పార్టీ ఓటింగ్కు పట్టుపట్టాలని నిర్ణయించుకుంది. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలకు విప్ జారీ చేసింది.
టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలు పార్టీ విప్ను ధిక్కరిస్తే, వారిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్ను కోరాలన్న ఆలోచనతోనే విప్ జారీ చేసింది. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీ విప్ ధిక్కరించినవారిని అనర్హులుగా ప్రకటించారు. ఇప్పుడు కూడా కాంగ్రెస్ అదే వ్యూహం పన్నింది.
**