హైదరాబాద్: ఐపీఎల్ సన్‌రైజర్స్ జట్టు సభ్యులు అపోలో ఆస్పత్రిలో సందడి చేశారు. జట్టు సభ్యులు డేల్ స్టెయిన్, రవి బోపారా, డేవిడ్ వార్నర్, ఎమ్.హెన్రిక్స్, హనుమ విహారీ, ఆశిష్‌రెడ్డి, తోపాటు జట్టు మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్, ముత్తయ్య మురళీధరన్ తదితరులు అపోలో, సాహి సంయుక్తంగా నిర్వహిస్తున్న హియరింగ్ ఇంపేర్డ్ గర్ల్ చైల్డ్ ప్రాజెక్టును మంగళవారం అపోలో ఆస్పత్రిలో ప్రారంభించారు.
ఈ సందర్భంగా క్రికెటర్లు చిన్న పిల్లలతో సరదాగా గడిపారు. ఈ సందర్భంగా అపోలో హెల్త్‌సిటీ, సాహి సెక్రటరీ డాక్టర్ ఇ.సి.వినయ్‌కుమార్ మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా ఆడపిల్లలకు సహాయం అందించాలనేది ముఖ్య ఉద్దేశమని తెలిపారు. వినికిడి లోపాల వల్ల ప్రతి ఆడపిల్ల మానసికంగా, శారీరకంగా తీవ్ర ఒత్తిడికి గురవుతుదని మన సమాజంలో తల్లిదండ్రులు ఆడపిల్లలపై తగిన చొరవ చూపడం లేదని అన్నారు.
అపోలోలో క్రికెట్ స్టార్ల సందడి
Published Wed, May 13 2015 12:31 AM | Last Updated on Mon, Aug 20 2018 2:31 PM
Advertisement
Advertisement