నర్వ (మహబూబ్‌నగర్): అప్పుల బాధతో అన్నదాత పురుగులమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా నర్వ మండలం కణ్మనూరు గ్రామంలో బుధవారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన చిన్న కొండన్న(43) తనకున్న మూడున్నర ఎకరాల భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.
గత రెండేళ్లుగా పంట దిగుబడి లేకపోవడంతో పాటు.. ఈ ఏడాది వేసిన కందిపంట ఎండి పోవడంతో.. మనస్తాపం చెంది పొలంలోనె పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
Published Wed, Sep 23 2015 5:36 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM
Advertisement
Advertisement