గురుకుల విద్యార్థిని ఆత్మహత్య
భద్రాచలం: భద్రాచలంలోని గిరిజన గురుకుల బాలికల కళాశాల విద్యార్థిని కణిత ఝాన్సీ బుధవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. ఈమెను కళాశాల లెక్చరర్ వేధిస్తున్నట్టుగా ఆమె డైరీ ద్వారా వెల్లడైంది. లెక్చరర్ వేధింపు కారణంగానే ఝాన్సీ ఆత్మహత్య చేసుకుందని ఆరోపిస్తూ మృతదేహంతో ఆమె బంధువులు సదరు కళాశాల ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు.
ఝాన్సీ తండ్రి సీతారామయ్య, అన్న బాలకృష్ణ తెలిపిన ప్రకారం...
చర్ల మండలం సుబ్బంపేట గ్రామానికి చెందిన కణిత ఝాన్సీ.. భద్రాచలంలోని చర్ల రోడ్డులోగల గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె బుధవారం సాయంత్రం నెల్లిపాక మండలం చింతలగూడెంలో తన అన్న వరుసైన కణిత బాలకృష్ణ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె అక్క వివాహ నిశ్చితార్థం కోసమని బాలకృష్ణ, ఆయన కుటుంబీకులంతా సుబ్బంపేటకు వెళ్లారు.
ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఝాన్సీ ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న కుటుంబీకులు వెంటనే చింతలగూడెం వెళ్లి మృతదే హాన్ని సుబ్బంపేట తీసుకెళ్లారు. ఆ తరువాత, ఆమె పుస్తకాలను పరిశీలిస్తుండగా డైరీ దొరికింది. ‘‘నా మరణానికి కళాశాలలోని ఓ లెక్చరర్ కారణం’’ అని రాసి ఉండటాన్ని వారు గమనించారు. తమ బిడ్డను లెక్చరర్ పొట్టనపెట్టుకున్నారని ఆరోపిస్తూ ఝన్సీ కుటుంబీకులు, బంధువులు ఆమె మృతదేహంతో భద్రాచలంలోని కళాశాల వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. దీనికి ఎస్‌ఎఫ్‌ఐ, గిరిజన విద్యార్థి సంక్షేమ పరిషత్, ఆదివాసీ విద్యార్థి సంక్షేమ పరిషత్ మద్దతుగా నిలిచాయి. లెక్చరర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు పెద్దపెట్టున నినాదాలు చేశారు. పోలీసుల సూచనతో నెల్లిపాక పోలీస్ స్టేషన్‌లో కుటుంబీకులు ఫిర్యాదు చేశారు.
విచారణ జరిపిస్తాం : డీడీ
ధర్నా చేస్తున్న ఝాన్సీ కుటుంబీకుల వద్దకు ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డెరైక్టర్ (డీడీ) సరస్వతి వెళ్లారు. ఝాన్సీ మృతిపై సమగ్ర విచార ణ జరిపిస్తామని, లెక్చరర్ తప్పు ఉన్నట్టుగా తేలి తే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీం తో, ఆందోళనకారులు శాంతించి ధర్నా విరమిం చారు. విద్యార్థిని అంత్యక్రియల కోసం ప్రభుత్వపరంగా ఐదువేల రూపాయలు ఇచ్చారు. డీడీ సరస్వతి, ప్రిన్సిపాల్ మాణిక్యాలరావు చెరొక ఐదువేల రూపాయల చొప్పున ఇచ్చారు. అనంతరం, ఝాన్సీ సహ విద్యార్థులతోపాటు కళాశాల లెక్చరర్ల నుంచి వివరాలను డీడీ సేకరించారు. విద్యార్థిని మృతిపై పూర్తిస్థారుులో విచారణ జరుపుతున్నామని, నివేదికను ఐటీడీఏ పీవోకు ఇస్తామని అన్నారు.
ఆత్మహత్యపై అనుమానాలు
ఝాన్సీ ఆత్మహత్యపై కొందరు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తనను తరచుగా లెక్చరర్ తిడుతోందని, తాను చనిపోవడానికి ఆమె కారణమని ఝాన్సీ తన డైరీలో రాసుకుంది. ఇది గత నెల 22వ తేదీన రాసినట్టుగా ఉంది. డైరీ రాసి న ఇన్ని రోజుల తరువాత, అందులోనూ సంక్రాం తి సెలవులకు ఇంటికి వెళ్లి, తిరిగి కళాశాలకు వచ్చే క్రమంలో, బంధువుల ఇంట్లో ఎందుకు ఆత్మహత్య చేసుకుంది? ఆత్మహత్యకు ముందు ఏం జరిగింది? తన అక్క వివాహ నిశ్చితార్ధం వేడుకకు ఎందుకు వెళ్లలేదు? మృతదేహాన్ని నేరుగా సుబ్బంపేటకు ఎందుకు తీసుకెళ్లారు? అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నారుు. ఝాన్సీ ఆత్మహత్యపై పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు.
లెక్చరర్ బదిలీ
విద్యార్థిని ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న లెక్చరర్‌ను బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ గురుకుల ఆశ్రమ కళాశాలకు బదిలీ చేశారు. ఐటీడీఏ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇంచార్జ్ పీవో దివ్య ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.