నిజామాబాద్ నాగారం న్యూస్‌లైన్: జిల్లాలో ట్రాన్స్‌కో శాఖ అవినీతి, అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కొన్ని నెలలుగా ఈ శాఖలో కుంభకోణాలు వెలుగుచూస్తున్నాయి. అనర్హులకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారని, కీలక పోస్టుల్లో అనుభవం లేని అధికారులను నియమిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇక్కడి నుంచి...
కాపర్, అల్యూమీనియం విక్రయాల్లో అవకతవకలకు పాల్పడడంతో ఒక ఏడీఈ, నలుగురు ఏఈలు గతంలో సస్పెన్షన్‌కు గురయ్యారు. అయితే సస్పెన్షన్ అయిన ఏడీఈ, ఏఈల పోస్టుల్లో అనుభవం లేని అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ట్రాన్స్‌కోలో ఓ ఇంజినీరింగ్ అసోసియేషన్ నాయకుడి కనుసన్నుల్లోనే వీరిని నియమించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా అధికారులు మాత్రం జనరల్ బదిలీల ప్రకారమే బదిలీలు జరినట్లు చెబుతున్నారు. అయితే తెరవెనుక మాత్రం పెద్ద కథ జరిగినట్లు పలువురు ట్రాన్స్‌కో ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.
పథకం ప్రకారమే జరిగిందా..?
ట్రాన్స్‌కోలో కాపర్, అల్యూమీనియం విక్రయాల్లో సుమారు రూ.70 లక్షల మేర అక్రమాలు జరిగాయి. దీనిపై అప్పట్లో ‘సాక్షి’లో వరుస కథనాలు రావడంతో ఏకంగా ఏడీఈ, నలుగురు ఏఈలు సస్పెన్షన్‌కు గురయ్యారు. అక్రమాలకు పాల్పడ్డాడని ఆ తర్వాత కొన్ని రోజులకు స్టోర్స్ ఏఈని సైతం సస్పెన్షన్ చేశారు. అయితే పక్కా పథకం ప్రకారమే ఇవన్ని జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అర్హులను పక్కనబెట్టి...
జిల్లా విద్యుత్ కార్యాలయంలో ఉన్న స్టోర్‌కు ఏడీఈగా అన్ని అర్హతలు ఉన్న మోర్తాడ్ మండలానికి సంబంధించిన వినోద్ అర్హుడు. సీనియారిటీ ప్రకారం ఆయనకే ఈ పోస్టు ఇవ్వాలి. కాని అలా జరగలేదు. పోనీ ఆయన తర్వాత సీనియారిటీ ప్రకారం వికలాంగుడైనా సంజీవ్‌రెడ్డికి ఈ పోస్టు ఇవ్వాలి. వీరిద్దరు కాకుండా దోమకొండ మండలంలో ఏడీఈగా పనిచేస్తున్న వెంకటరమణకు కేవలం రిక్వెస్ట్ మీద స్టోర్ ఏడీఈ పోస్టు ఇచ్చారు. దీనిపై మోర్తాడ్ ఏడీఈ వినోద్ అధికారులను ప్రశ్నించాడు. స్పందించిన పైఅధికారులు తొందరలోనే నీకు న్యాయం చేస్తామని, మంచి పోస్టుకు బదిలీ చేస్తామని ఏడీఈ వినోద్‌కు హామీ ఇచ్చారు. దీంతో ఆయన వెనక్కి తగ్గాడు. అప్పుడే వినోద్‌కు భీమ్‌గల్ మండలానికి ఏడీఈగా బదిలీ చేశారు. ఆ తర్వాత వెంకటరమణ స్టోర్ ఏడీఈగా బాధ్యతలు చేపట్టాడు.
అనుభవం లేనివారికి పోస్టులు...
ట్రాన్స్‌ఫార్మర్ ఎస్‌పీఎం కుంభకోణంలో ఒక ఏడీఈ, నలుగురు ఏఈలు సస్పెషన్ గురయ్యారు. అయితే ఖాళీగా ఉన్న పోస్టుల్లో అదే విభాగానికి సంబంధించిన అనుభవం ఉన్న అధికారులను నియమించాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం, ఎస్‌పీఎం ఏడీఈగా భీమ్‌గల్ మండలానికి సంబంధించిన వినోద్‌ను బదిలీ చేశారు. ఇక ఏఈ పోస్టులో కనీసం సీనియారిటీ, అనుభవం లాంటివి ఏమి లెక్కలోకి తీసుకోకుండా నచ్చిన వారికే పోస్టులను కట్టాబెట్టారు. నిజామాబాద్ ఏఈగా తోటరాజశేఖర్, కామారెడ్డి ఏఈగా ప్రసాద్‌రెడ్డి, ఆర్మూర్ ఏఈగా రాజేశ్వర్, బాన్సువాడ ఏఈగా చంద్రశేఖర్‌లను నియమించారు. వీరికి ట్రాన్స్‌ఫార్మర్ విభాగంలో ఎలాంటి అనుభవం లేదు. వీరు విభాగానికి ఏం న్యాయం చేస్తారని ట్రాన్స్‌కో ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు.
వీరి గత చరిత్ర ఇదీ..
నిజామాబాద్ ఏఈగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న తోట రాజశేఖర్‌ను కొన్ని నెలల క్రితం బాన్సువాడ అదనపు బాధ్యతలు అప్పగించారు. అయినా ఆయన అక్కడికి వెళ్లలేదు. నిజామాబాద్ ఏఈ సస్పెన్షన్ కావడంతో ఇదే అనువుగా చేసుకుని అధికారులను మచ్చిక చేసుకుని ఈ పోస్టులో తిష్టవేశారు.
కామారెడ్డి ఏఈగా వచ్చిన ప్రసాద్‌రెడ్డి బర్దిపూర్ ఏఈగా పనిచేస్తున్న సమయంలో ఆదిలాబాద్‌లో ఏఈతో మ్యూచ్‌వల్ పెట్టుకున్నారు. అక్కడి నుంచి ఏఈ ఇక్కడికి వచ్చారు. కానీ ప్రసాద్‌రెడ్డి మాత్రం అక్కడికి పోలేదు. ఇక్కడే ఏఈ టెక్నికల్ విజిలెన్స్‌లో చేరాడు. ఆరు నెలలు తిరగకుండానే కామారెడ్డి ఏఈగా బాధ్యతలు తీసుకున్నారు.
ఆర్మూర్ ఏఈగా వచ్చిన రాజేశ్వర్ గతంలో బాల్కొండ ఏఈగా పనిచేశారు. అంతకుముందు కరీంనగర్ నుంచి ఇక్కడికి బదిలీపై వచ్చారు. ఆరు నెలలు తిరగకుండానే ఆర్మూర్ ఏఈగా బాధ్యతలు చేపట్టారు.
బాన్సువాడ ఏఈగా చంద్రశేఖర్ వచ్చారు. గతంలో మీటర్ల విషయంలో పలు అక్రమాలకు పాల్పడ్డాడని సస్పెన్షన్‌కు గురయ్యారు. విచారణ జరుగుతున్న సమయంలో వరంగల్‌కు పంపించారు. ఈ సమయంలో 3 ఇంక్రిమెంట్లు కూడా కోల్పోయారు. ఏఈ టెక్నికల్ ఎంఅండ్‌పీ డివిజన్‌కు వచ్చారు. ఇలా మళ్లీ ఆరు నెలలు తిరగకుండానే బాన్సువాడ ఏఈగా బదిలీపై బాధ్యతలు స్వీకరించారు.
అంతా నాయకుడి కనుసన్నుల్లోనే..?
ట్రాన్స్‌కోలో బదిలీల బాగోతం మొదలుకొని సస్పెన్షన్ వ్యవహారాల వరకు అన్ని ఓ ఇంజినీరింగ్ అసోసియేషన్ నాయకుడి కనుసన్నుల్లోనే జరుగుతున్నాయని పలువురు శాఖా ఉద్యోగు లు ఆరోపిస్తున్నారు. ఎవరిని బదిలీ చేయాల న్నా... ఎవరికి ఏ పోస్టు ఇవ్వాలన్నా అంతా ఆ యన కనుసన్నుల్లోనే జరుగుతున్నాయి. అనుభ వం లేని అధికారులకు తనదైన శైలిలో ఆయన పోస్టులు ఇప్పించాడు. దీనికిగాను పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు ఉన్నా యి. ఒక్కసారి ఒప్పందం చేసుకుంటే ఎలాంటి పనైనా చేసి తీరుతాడని సదరు యూనియన్ నా యకుడికి పేరుంది. పైఅధికారులతో ఉన్న సం బంధాల వల్ల ఈ వ్యవహారాలు చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి. జిల్లా ట్రాన్స్‌లో ఇన్ని అ క్రమాలు జరుగుతున్నా సంబంధిత ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తున్నాయి.
అక్రమాలకు కేరాఫ్ ట్రాన్స్‌కో?
Published Fri, May 23 2014 3:06 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement