నగరంలో స్వచ్ఛ భారత్ | In the city swacha bharath | Sakshi
Sakshi News home page

నగరంలో స్వచ్ఛ భారత్

Published Sat, Nov 15 2014 3:15 AM | Last Updated on Thu, Mar 21 2019 8:24 PM

నగరంలో స్వచ్ఛ భారత్ - Sakshi

నగరంలో స్వచ్ఛ భారత్

కలెక్టర్ జి.కిషన్ పిలుపుమేరకు శుక్రవారం నగరంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాలలు, పాఠశాలల విద్యార్థులు, ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు చెత్తాచెదారాన్ని తొలగించి, రోడ్లను శుభ్రం చేశారు.

కేయూ క్యాంపస్ : కాకతీయ యూనివర్సిటీ పీజీ కళా శాల, మహిళా పీజీ కళాశాలలో విద్యార్థులు స్వచ్ఛ భారత్ నిర్వహించారు. పీజీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ అశోక్‌కుమార్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి రాజు, వీవీఎస్.శర్మ, రాజేందర్, సత్యనారాయణ, కె.యాకయ్య, ఇ.రమేష్, రమాదేవి, సరిత, శేషు పాల్గొన్నారు. మహిళా పీజీ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ తిరుమలాదేవి, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ శ్రీదేవి పాల్గొన్నారు. కేడీసీ ఆధ్వర్యంలో జేఎన్‌ఎస్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఆర్.మార్తమ్మ, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఆర్. శ్రావణ్‌కుమార్, విక్టర్, సురేశ్‌బాబు, కె.సత్యనారాయణ, రజనీలత, కె.సోమిరెడ్డి, జె. స్వామి, నర్సింహామూర్తి, విష్ణుచరణ్, హిమబిందు పాల్గొన్నారు.

హన్మకొండలోని ప్రభుత్వ వృత్తి విద్యా కళాశాల విద్యార్థులు హన్మకొండ, కుమార్‌పల్లి, అశోక థియేటర్ పరిసరాల్లో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. డీవీఈఓ ఎ.పరాంకుశం, ప్రిన్సిపాల్ వి.లక్ష్మారెడ్డి, అధ్యాపకులు జయపాల్‌రెడ్డి, శ్రీదేవి, రాజేంద్రప్రసాద్, రవి, తిరుపతి, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ సురేష్‌లాల్, ప్రోగ్రాం ఆఫీసర్ ఆర్.ప్రవీణ్‌కుమార్, ఎం సమ్మయ్య పాల్గొన్నారు. హన్మకొండలోని సెయింట్ జోసెఫ్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో సెక్రటరీ లూత్‌మేరి, విద్యార్థినులు, ఎస్‌ఎస్ జూనియర్ కళాశాల విద్యార్థులు ఆర్‌ఐఓ మలహల్‌రావు, శానిటరీ ఇన్‌స్పెక్టర్ 46వ డివిజన్‌లో చెత్తాచెదారాన్ని తొలగించారు.

టీచర్స్ కాలనీలో..

సుబేదారి : నగరంలోని టీచర్స్‌కాలనీ పేజ్-1లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రగతిమిత్ర కాలనీ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు వల్లంపట్ల నాగేశ్వర్‌రావు, ఇమ్మడి పుల్లయ్య ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ పార్కులో చెత్తాచెదారాన్ని తొలగించారు. కార్యక్రమంలో ప్రగతిమిత్ర గౌరవ అధ్యక్షుడు డోలి రాజలింగం, నాయకులు రాంరెడ్డి, వెంకటేశ్వర్లు, రామస్వామి, రఘుపతిరెడ్డి, శ్రీనివాస్, భూపాల్‌కర్ణ, జనార్దన్ పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో..

కాజీపేట : పట్టణ శివారులోని సోమిడి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో స్వచ్ఛ భారత్ నిర్వహిం చారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం వెంకటేశ్వర్లు విద్యార్థులతో స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేశారు. పాఠశాల ఆవరణలో ఉన్న పిచ్చిమొక్కలు, గడ్డి, చెత్తాచెదారాన్ని తొలగించారు. విద్యాకమిటీ చైర్మన్ కొంరయ్య, ఉపాధ్యాయులు నరేందర్, పి.రాజిరెడ్డి, రాజేంద్రప్రసాద్, రాజేశ్వర్‌రావు, గోపిచంద్, ఆర్.లక్ష్మణ్‌సుధాకర్,రాజు, జయరాజ్ పాల్గొన్నారు. కాజీపేట బాలి కల ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కె.పుష్పాంజలి, టి.జ్ఞానేశ్వర్, దర్గాకాజీపేట ప్రభు త్వ ఉన్నత పాఠశాలలో హెచ్‌ఎం సుందరాచార్యులు ఆధ్వర్యంలో విద్యార్థులు శ్రమదానం చేశారు.   
 
కేయూ జంక్షన్‌లో..

నయీంనగర్ : హన్మకొండ కేయూ జంక్షన్‌లోని ఎస్‌వీఎస్ జూనియర్ కళాశాల విద్యార్థినులు కళాశాల పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. కార్యక్రమంలో కళాశాల వైస్ చైర్‌పర్సన్ డాక్టర్ ఎర్రబెల్లి సువర్ణ, కళాశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా సరస్వతి నగర్‌లో జరిగిన కార్యక్రమంలో కార్పొరేషన్ ఏఈ కీర్తి, నోడల్ ఆఫీసర్ శంకర్‌రెడ్డి, జవాన్లు కవిత, దామోదర్, కాలనీ కమిటీ నాయకులు ప్రభాకర్‌రెడ్డి, యాదిరెడ్డి, నేతాజీ పాల్గొన్నారు. 48వ డివిజన్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం.శివాజీ, మాజీ కార్పొరేటర్ స్వామిచరణ్, ఎస్‌ఆర్ కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు.
 
హంటర్‌రోడ్డులో..

హన్మకొండ చౌరస్తా : హంటర్‌రోడ్డులోని సీవీ రామన్ జూనియర్ కళాశాలల ఆధ్వర్యంలో బాలసముద్రం, హంటర్‌రోడ్డు, అడ్వకేట్స్‌కాలనీలో స్వచ్ఛ భారత్ నిర్వహించారు. కళాశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బంది చెత్తాచెదారాన్ని తొల గించి, రోడ్డను ఊడ్చారు. కళాశాలల చైర్మన్ పి.కోటేశ్వర్‌రావు, డెరైక్టర్ పి.పూర్ణానందరావు, ప్రిన్సిపాల్ తీగల శ్రీధర్, అధ్యాపకులు శోభన్‌బాబు, రాజేంద్రప్రసాద్, సంపత్, అన్వర్, కె.సత్యనారాయణరెడ్డి, రాజు, ఇందు, అక్షిత, సంధ్య పాల్గొన్నారు.

 సిద్ధార్థనగర్‌లో..

 నిట్ క్యాంపస్ : సిద్ధార్థనగర్‌లో కాలనీ వెల్ఫేర్ సొసై టీ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్లను ఊడ్చి చెత్తను తొల గించారు. కార్యక్రమంలో కాలనీ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు వాసుదేవరెడ్డి, కార్యదర్శి వినయ్‌భూషణ్, కాలనీ వాసులు బుచ్చం రావు, రాంచందర్, మహేందర్‌రెడ్డి, రమాకాంత్‌రెడ్డి, జలంధర్, జోజిరెడ్డి, జీవరత్నం పాల్గొన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement