సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌కు ప్రధాన పౌరసంబంధాల అధికారిగా సీనియర్ జర్నలిస్టు జ్వాలా నర్సింహారావును నియమించనున్నట్టు సమాచారం. ఆయనతోపాటు వరంగల్‌లో ఓ టీవీ చానల్ పనిచేస్తున్న విజయ్‌కుమార్‌ను సీఎంవో పౌర సంబంధాల అధికారిగా నియమించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. నేడో రేపో ఈ మేరకు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.
టీ హోంమంత్రి ఓఎస్‌డీగా జగదీశ్వర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ఓఎస్‌డీగా డీఎస్పీ జగదీశ్వర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జగదీశ్వర్‌రెడ్డి ప్రస్తుతం కరీంనగర్ జిల్లా గోదావరిఖని డీఎస్పీగా ఉన్నారు. యాంటీ నక్సల్స్ నిఘా విభాగానికి ఈయనను బదిలీ చేసి అనంతరం హోం మంత్రి ఓఎస్‌డీగా నియమించారు.