ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల మండల పరిషత్ సమావేశం ఆదివారం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. ఎటువంటి ఎజెండా, తీర్మానం లేకుండా ఇష్టం వచ్చినట్లు నిధులు ఖర్చు చేస్తున్నారని వైస్ ఎంపీపీ మందపల్లి శ్రీనివాస్(టీఆర్‌ఎస్) ఆరోపించారు. ఇందుకు ఎంపీపీ వీర సత్యనారాయణ అభ్యంతరం తెలపటంతో ఇరువర్గాల మధ్య వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి.
దాంతో వైస్ ఎంపీపీ సహా ఆయనకు మద్దతు పలికిన 15 మంది సభ్యులు సమావేశం బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి... సమావేశం నుంచి వెళ్లిపోయారు. కాగా, మిగిలిన 9 మంది సభ్యులతోనే ఎంపీపీ సమావేశాన్ని కొనసాగించారు.