మధిరా నియోజకవర్గం
సాక్షి, మధిర: మధిర శాసనసభ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. నాడు మధిర నియోజకవర్గంలో మధిర, బోనకల్, ఎర్రుపాలెం, వైరా, తల్లాడ మండలాలు ఉండేవి. మొదటినుంచి మధిర నియోజకవర్గంలో పురుషుల ఓట్లకంటే మహిళల ఓట్లు అధికంగా ఉన్నాయి. ఈ క్రమంలో మధిర అసెంబ్లీ స్థానం నుంచి మొట్టమొదటిసారిగా 1972వ సంవత్సరంలో దుగ్గినేని వెంకట్రావమ్మ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేశారు. ఆమె మధిర మండలం ఇల్లూరు గ్రామానికిచెందినవారు. ఈ ఎన్నికల్లో సీపీఎం తరపున పోటీచేసిన బోడేపూడి వెంకటేశ్వరరావుపై విజయం సాధించారు. ఆమెకు 40,799ఓట్లు రాగా బోడేపూడికి 23,457 ఓట్లు వచ్చాయి. దీంతో 17,342 ఓట్ల మెజార్టీతో ఆమె గెలిచారు. దీంతో మొట్టమొదటిసారిగా మధిరనుంచి ఎమ్మెల్యేగా ఒక మహిళ ప్రాతినిధ్యం వహించినట్లయింది.
వెంకట్రావమ్మ విజయవాణి
2009 ఎన్నికల్లో నూతనంగా ఏర్పడిన ప్రజారాజ్యం పార్టీ నుంచి ఎర్రుపాలెం మండలం పెగళ్లపా డు గ్రామానికి చెందిన సగ్గుర్తి విజయవాణి పోటీచేశారు. ఆమె పెద్దపల్లి డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌ఓగా పనిచేస్తూ ఉద్యోగానికి రాజీనామా చేసి ఈ ఎన్నికల్లో పోటీచేశారు. ఈ ఎన్నికల్లో మొత్తం 1,59,985 ఓట్లు పోలవ్వగా అందులో ప్రజారాజ్యం పార్టీ తరపున పోటీచేసిన విజయవాణికి 14,615 ఓట్లు వచ్చాయి. ఓటమి చెందిన తరువాత తిరిగి ఉద్యోగంలో చేరలేదు. ప్రస్తుతం వారు రాజకీయాల కు దూరంగా ఉంటూ మం చిర్యాలలో స్థిరపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment