జీవితంలో విద్యార్థి దశ కీలకం | main importance student stage in life | Sakshi
Sakshi News home page

జీవితంలో విద్యార్థి దశ కీలకం

Published Tue, Jan 27 2015 3:32 AM | Last Updated on Wed, Apr 3 2019 9:12 PM

జీవితంలో విద్యార్థి దశ కీలకం - Sakshi

జీవితంలో విద్యార్థి దశ కీలకం

సినీ నటి మంచు లక్ష్మి
ఘట్‌కేసర్: జీవితంలో విద్యార్థి దశ అత్యంత కీలకమైనదని ప్రముఖ సినీ నటి మంచు లక్ష్మి పేర్కొన్నారు. మండల పరిధిలోని పోచారం సంస్కృతి టౌన్‌షిప్‌లోని శ్రీవిద్యానికేతన్ పాఠశాలలో సోమవారం నిర్వహించిన  రిపబ్లిక్ డే, స్పోర్ట్స్ డే  వేడుకలకు అమె ముఖ్యఅతిథిగా హాజరయ్యూరు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చిన్నారులు ఇప్పటి నుంచే ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని అందుకోసం  కృషి చేయూలని సూచించారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి యోగా వంటివి నేర్చుకోవాలన్నారు.

ఆటపాటలతోపాటు చదువును విస్మరించరాదన్నారు. ఈ సందర్భంగా ఆమె బాల్య స్మృతులను నెవురువేసుకున్నారు. అనంతరం నిర్వహించిన క్రీడా పోటీల విజేతలకు బహువుతులు అందజేశారు. కార్యక్రమంలో ఆనంద్ శ్రీనివాస్, ప్రిన్సిపాల్ భవాని,  ఏఓ హేమచంద్ర, కాంగ్రెస్ నాయకుడు సింగిరెడ్డి, రాంరెడ్డి, సంస్కృతి టౌన్‌షిప్ అధ్యక్షుడు హరిప్రసాద్, కాలనీ ఉపాధ్యక్షుడు మెట్టు నర్సింహారెడ్డి, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement