తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా తాగునీటి కష్టాలు లేకుండా చూడాలని జిల్లాల కలెక్టర్లను పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు. వేసవిలో విద్యుత్ కోతలు లేనందున ఎక్కడా తాగునీటికి ఇబ్బంది కలగకుండా చూడాలని తెలిపారు.
వేసవి తాగునీటి సమస్యల పరిష్కారానికి రూ. 263 కోట్లు కేటాయించినట్లు మంత్రి కేటీఆర్ చెప్పారు. జాతీయ గ్రామీణ ఉపాధి హమీ పథకంపై వివిధ జిల్లాల కలెక్టర్లతో మంత్రి కేటీఆర్ వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనుల కోసం అడిగిన ప్రతి ఒక్కరికీ ఉపాధి హామీ కార్డులు ఇవ్వాలని ఆయన ఆదేశించారు.
తాగునీటి కష్టాలు ఉండకూడదు: మంత్రి
Published Mon, Apr 6 2015 7:03 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM
Advertisement