ఎంసెట్ పరీక్ష రాసిన తల్లీ కొడుకులు
పాలకుర్తి (వరంగల్ జిల్లా), న్యూస్‌లైన్: కొడుకుతోపాటు తల్లి ఎంసెట్ పరీక్ష రాసిన విచిత్రమిది. వరంగల్ జిల్లా పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన వేముల సునీతకు పదో తరగతి అనంతరం 1994లో వివాహమైంది. ఇద్దరు పిల్లల తర్వాత మళ్లీ చదువుకోవాలనే ఆశ కలిగింది. భర్త వేముల శ్రీనివాస్ ప్రోత్సాహంతో ఆమె మళ్లీ చదువును కొనసాగించారు. 2013లో సైన్స్ గ్రూపులో ఓపెన్ ఇంటర్ పూర్తి చేశారు. ఆర్‌ఎంపీగా పనిచేస్తూ ఇంట్లోనే మెడికల్ షాప్ నిర్వహిస్తున్న భర్త శ్రీనివాస్‌కు సాయుంగా ఉండే సునీతకు బీఫార్మసీ చేయాలనే అలోచన కలిగింది.
దీంతో విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం పూర్తి చేసి.. ఎంసెట్ (మెడిసిన్)కు సిద్ధమవుతున్న తన కుమారుడు వేముల అజిత్ కుమార్‌కి విషయం చెప్పారు. కుమారుడు ఎంసెట్ నోట్స్ తయారు చేసి ఇవ్వగా పరీక్షకు సిద్ధమయ్యారు. వరంగల్‌లోని శ్రీగాయత్రీ డిగ్రీ కాలేజీలో తల్లి సునీత, ఎల్‌బీ పీజీ కాలేజీలో కుమారుడు అజిత్‌కుమార్ గురువారం ఎంసెట్ పరీక్ష రాశారు. ‘‘18 ఏళ్ల తర్వాత మళ్లీ చదువుకోవాలని ఆలోచన వచ్చింది. నా భర్త, కువూరుడు ఇచ్చిన ప్రోత్సాహంతో ఎంసెట్ పరీక్షకు సిద్ధమయ్యూ. బీఫార్మసీ పూర్తి చేసి మంచి ఉద్యోగం సాధిం చాలని ఉంది’’ అని సునీత తెలిపారు.