ముస్లిం మైనారిటీల సంక్షేమమే ధ్యేయం : ఎమ్మెల్యే సునీత
యాదగిరిగుట్ట : ముస్లిం మైనారిటీల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషిచేస్తోందని ఆలేరు ఎమ్మెల్యే గొం గిడి సునీతారెడ్డి పేర్కొన్నారు. గురువారం గుట్ట పట్టణంలోని శివాజీరోడ్‌లో హజ్రత్ సయ్యద్ షా అలీ హుస్సేన్ దర్గా షరీఫ్ వద్ద ఘనంగా ఉర్సు ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భం గా ఆమె ఉత్సవంలో పాల్గొని మాట్లాడారు. ముస్లింల అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు విడుదల అయ్యేలా కృషిచేస్తామన్నారు. దర్గాల అభివృద్ధి, షాదీఖానాల నిర్మాణం కోసం కృషిచేస్తానన్నారు. వక్ఫ్ భూములు అన్యాక్రాంతం కా కుండా చూస్తానని చెప్పారు.
అంతకు ముందు పట్టణంలోని యోగానందనిలయం నుంచి దర్గా వరకు గంధాన్ని ఎమ్మెల్యే సునీతారెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌రెడ్డిలు తలపై ఉంచుకొని ఊరేగించారు. ముస్లిం సం ప్రదాయ పద్ధతిలో ముస్లిం గురువుల సమక్షంలో గంధం ఊరేగింపు జరిగింది. గంధం ఊరేగింపులో పట్టణంలోని వివి ధ పార్టీల నాయకులు హిందూ, ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం దర్గా వద్ద గంధానినికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉత్సవంలో సర్పంచ్ బూడిద స్వామి, ఎస్‌డీ.సలీం, నాయకులు మిట్ట రాం శంకర్‌గౌడ్, నాగయ్య, బాబా, షంషీర్‌పాషా, మన్సూర్‌పాషా పాల్గొన్నారు.