కరీమాబాద్ : వరంగల్ జిల్లా కరీమాబాద్‌లో 10వ తరగతి, ఇంటర్‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బుధవారం జరిగిన కార్యక్రమంలో ప్రజ్ఞా పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ఒక్కో విద్యార్థికి పదివేల రూపాయల నగదుతో పాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లర్న్ టు లైవ్ ఫౌండేషన్ చైర్మన్, అమెరికాకు చెందిన కీ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ సీఈవో జ్యోతిరెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ అత్యుత్తమ ప్రతిభ కనపరచిన పేద విద్యార్థులకు ప్రతి ఒక్కరూ ప్రొత్సహించాలని, సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. 2016 నుంచి తెలంగాణ ప్రభుత్వం కూడా కేజీ నుంచి పీజీ వరకూ ఉచిత విద్యా పథకాన్ని ప్రవేశపెడుతోందని చెప్పారు.
విద్యార్థులకు ప్రజ్ఞా పురస్కారాలు
Published Wed, Jun 3 2015 2:02 PM | Last Updated on Sun, Sep 3 2017 3:10 AM
Advertisement