సాక్షి, హైదరాబాద్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సమక్షంలో ప్రకాశం జిల్లా దర్శికి చెందిన మద్దిశెట్టి వేణుగోపాల్ పార్టీలో చేరారు. కేంద్ర కార్యాలయంలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, బాలినేని శ్రీనివాస్‌రెడ్డి, శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.
నియోజకవర్గంలో పార్టీని గెలిపిస్తా..
వైఎస్ జగన్ ప్రవేశపెట్టనున్న నవరత్నాలతో ప్రజల జీవితాల్లో వెలుగుగు నిండనున్నాయని మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. అందరి సహకారంతో వైఎస్సార్‌సీపీ బలోపేతానికి పాటుపడతానని చెప్పారు. తన చేరికకు కారణమైన సీనియర్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment