ఔటర్‌పై స్కూలు బస్సు బోల్తా
ఔటర్ రింగ్‌రోడ్డుపై పెద్దగోల్కొండ రోటరీ జంక్షన్ సమీపంలో శుక్రవారం రాత్రి ఓ స్కూలు బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన విద్యార్థులంతా మెదక్ జిల్లా పటాన్‌చెరులోని సాయితేజ విద్యానికేతన్ పాఠశాలకు చెందిన వారు. వీరంతా విహార యాత్రకు వెళ్లివస్తున్నారు. బస్సు అతి వేగంగా ప్రయాణించి రోడ్డు పక్కనున్న సేఫ్‌గార్డును ఢీకొట్టడంతో టైరు పంక్షరై ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.