జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల టీఆర్‌ఎస్ అభ్యర్థి దేవీప్రసాద్ గెలుపు తెలంగాణ ద్రోహులకు చెంపపెట్టుకావాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి వి.శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లాకేంద్రంలో పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్ ఇంట్లో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణకు అనుకూలమైన బీజేపీ, తెలంగాణద్రోహల పార్టీ టీడీపీతో ఎలా పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నిం చారు. తెలంగాణకు నీళ్లు, విద్యుత్ విషయంలో టీడీపీ అన్యాయం చేస్తుందన్నారు.
అలాంటి పార్టీ మద్ద తు తెలుపుతున్న బీజేపీ అభ్యర్థికి ఓటు వేస్తే అది తెలంగాణ వ్యతిరేకులకు వేసినట్లు అవుతుందన్నారు. తెలంగాణ పునర్‌నిర్మాణంలో భాగస్వాములు కావాలనే ఉద్ధేశంతో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉద్యోగసంఘాల నేత దేవీప్రసాద్‌ను కేసీఆర్ ప్రకటించారని పేర్కొన్నారు. 43 శాతం ఫిట్‌మెంట్, ఉద్యోగులకు హెల్త్‌కార్డులు సాధించడంలో తమతోపాటు దే వీప్రసాద్ కృషి చాలా ఉందన్నారు. ఎన్నికల తరువాత పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
దేవీప్రసాద్‌కు మద్దతుగా ప్రచారంలో భాగంగా ఈనెల 5వ తేదీ జడ్చర్లలో సాయంత్రం 4, 6 గంటలకు మహబూబ్‌నగర్‌లో, 7న సాయంత్రం 4 గంటలకు కొత్తకోట, 6 గంటలకు వనపర్తిలో, 8న ఉదయం 10 గంట లకు కొల్లాపూర్‌లో, 12 గంటలకు నాగర్‌కర్నూల్‌లో, 2 గంటలకు అచ్చంపేట్‌లో 4 గంటలకు కల్వకుర్తి లో కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు మంత్రులు తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ జగదీశ్వర్‌రెడ్డి, పెద్దిరెడ్డి, రాజేశ్వర్‌గౌడ్, విఠల్‌రావుఆర్యా, కోరమోనివెంకటయ్య, ఆనంద్, బెనహార్, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
తీర్పు.. ద్రోహులకు చెంపపెట్టు కావాలి
Published Wed, Mar 4 2015 1:22 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement