కూసుమంచి: సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ పద్ధతిన విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు చెత్తను ఉపయోగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు మున్సిపల్ శాఖ రీజినల్ డెరైక్టర్ (హైదరాబాద్) ఎస్.శ్రీనివాసరెడ్డి తెలిపారు. మండల శివారు నల్లగొండ జిల్లా మోతే మండలంలోని హేమశ్రీ విద్యుత్ ప్లాంట్‌లో నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల మున్సిపల్ కమిషనర్లు, ఇతర అధికారులతో ఆయన శనివారం సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణలో వ్యర్థాలతో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు రెండు ప్రైవేటు ప్లాంట్లు ఏర్పాటయ్యాయని తెలిపారు. వాటిలో ఒకటి కరీంనగర్ జిల్లాలోని శాలివాహన పవర్‌ప్లాంట్, రెండోది మోతేలోని హేమశ్రీ పవర్ ప్లాంట్ అన్నారు. వీటిలో 55 శాతం మేర చెత్త, 15 శాతం బొగ్గు, 30 శాతం బయోమిల్‌తో విద్యుత్‌ను తయారు చేసే వీలుందని అన్నారు.
హేమాశ్రీ ప్రాజెక్టు మరో ఆరు నెలల్లో విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్న నేపథ్యంలో దాని క్లస్టర్ పరిధిలోని ఖమ్మం, నల్లగొండ, వరంగల్ జిలాల్లోని 21 మున్సిపాలిటీల నుంచి చెత్తను సమీకరించే ప్రణాళికలు తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఈ మున్సిపాలిటీల పరిధిలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలన్నారు. సమావేశంలో రిటైర్డ్ ఆర్జేడీ (మున్సిపల్ సర్వీసెస్) ఖాదర్‌బాబా, 21 మున్సిపాలిటీలకు చెందిన కమిషనర్లు, ఇతర అధికారులు, హేమశ్రీ ప్లాంట్ మేనేజింగ్ డెరైక్టర్ బ్రిజేష్‌కుమార్ రెడ్డి, చంద్రారెడ్డి, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయాలి
Published Sun, Nov 16 2014 2:59 AM | Last Updated on Wed, Sep 5 2018 1:45 PM
Advertisement
Advertisement