వరంగల్‌లో తొలిసారి సేవలు మొదలు
12 విభాగాల సమాచారం ఫోన్‌లోనే
భారత్ లీఫ్ సంస్థ ఆధ్వర్యంలో సేవలు
హన్మకొండ: నిత్య జీవితంలో అన్ని పనుల్లో చేదోడువాదోడుగా ఉంటున్న స్మార్ట్‌ఫోన్లు ఇప్పడు పొలంలోకి అడుగుపెట్టాయి.వ్యవసాయరంగానికి సంబంధించి రైతులకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు భారత్‌లీఫ్ పేరుతో అప్లికేషన్ అందుబాటులోకి వచ్చింది. తెలుగురాష్ట్రాల్లో వరంగల్ జిల్లాలో తొలిసారిగా ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. భారత్‌లీఫ్ అనే స్వచ్చంధ సంస్థ ఈ యాప్ రూపకల్పనతో పాటు నిర్వాహన బాధ్యతలు నిర్వర్తిస్తోంది.
సలహాలు, సూచనలు
భారత్‌లీఫ్ యాప్‌ను స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్నప్పటి నుంచి వ్యవసాయరంగానికి సంబంధించి తాజా సమాచారం, సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అధిక దిగుబడి సాధించేందుకు పాటించాల్సిన మెళకువలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచుతారు. లిఖిత రూపంలోనే కాకుండా ఫోటోలు, వీడియో, ఆడియో రూపంలో ఈ సమాచారం అందుబాటులో ఉంటుంది. దీంతో అక్షరాస్యులు, నిరక్ష్యరాస్యులు అనే తేడా లేకుండా రైతులందరికీ సమాచారం సుళువుగా అర్థమవుతుంది. వ్యవసాయరంగానికి సంబంధించి అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు, వ్యవసాయరంగ శాస్త్రవేత్తలు, వ్యవసాయమార్కెట్‌ల నుంచి సేకరించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఈ యాప్ ద్వారా రైతులకు అందుబాటులో ఉంచుతున్నారు. 2015 సెప్టెంబరులో ఈ యాప్‌ను జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. ప్రస్తుతం 300ల మంది రైతులు ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు.
12 విభాగాలు
భారత్‌లీఫ్ యాప్ ద్వారా మొత్తం 12 విభాగాలకు చెందిన సమాచారం పొందవచ్చు. పశుసంవర్థకశాఖ, మార్కెటింగ్, ఎరువులు, ఉద్యానశాఖ,బీమా, భ్యాంకు రుణాలు, ఆధునిక పరికరాలు, నీటి యాజమాన్య పద్దతులు, విత్తనాలు, వాతావరణం, పంటల రక్షణ, అధిక దిగుబడి, విస్తరణ, వ్యవసాయరంగంపై జరుగుతున్న సమావేశాలకు సంబంధించిన సమాచారాన్ని ఈ యాప్ ద్వారా అందుబాటులో ఉంచుతున్నారు. యాప్‌ను ఓపెన్ చేయగానే పైన పేర్కొన్న పన్నెండు విభాగాలకు సంబంధించి ప్రత్యేక లోగోలు కనిపిస్తాయి. ఒ క్కో విభాగానికి సంబంధించిన ప్రత్యేకంగా సమాచారం అందుబాటులో ఉంటుంది. కాలపరిమితికి లోబడి ఉండే స మాచారం ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోతుంటుంది. ఈ యాప్‌తో అందే ప్రతీ సమచారానికి సంబంధించి వివరాలు స్పష్టంగా ఉంటాయి. సమాచారం తెలిపే అధికారి/ శాస్త్రవేత్తల వివరాలను అందిస్తూ పారదర్శకత పెద్దపీఠ వేశారు.
రిజిష్ట్రేషన్ తప్పనిసరి
ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌పై లభించే ఈ యాప్‌ను ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ నుంచి నేరుగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం లేదు. యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఆసక్తి ఉన్న రైతులు ఫోటో, చిరునామా తదితర వివరాలతో దరఖాస్తు చేసుకోవాలి. ప్రతీ ఒక్క రైతుకు వేర్వేరు యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌లు కేటాయిస్తారు. ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్‌లో ఛజ్చిట్చ్ట్ఛ్చజ.ఛిౌఝ వెబ్‌సైట్‌కి వెళ్లి యూజన్‌నేమ్, పాస్‌వర్డులు ఇవ్వడం లాగిన్ అవచ్చు. అక్కడ పేర్కొన్న సూచనలు పాటించి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. రైతులతో పాటు ఎరువులు, విత్తనాలు, పురుగుల మందుల విక్రేతలకు సైతం ఈ యాప్‌ను అందుబాటులో ఉంచుతున్నారు. ఈ యప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేందుకు ఆసక్తి ఉన్న వారు 9490983570 నంబరులో సంప్రదించి రిజిష్ట్రేషన్ చేయించుకోవచ్చు.
స్మార్ట్‌ఫోన్‌లో సాగు సమాచారం
Published Sat, Oct 24 2015 1:49 AM | Last Updated on Mon, Aug 20 2018 2:35 PM
Advertisement
Advertisement