సాక్షి,హైదరాబాద్: కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో రాష్ట్రంలోని 74.35 లక్షల మంది లబ్ధిదారులకు రూ.1,500 చొప్పున మొత్తం రూ.1,115 కోట్లను శనివారం బ్యాంకుల్లో జమ చేసినట్లు పౌర సరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. బ్యాంకు ఖాతా లేని 5.38 లక్షల మంది లబ్ధిదారులకు పోస్టాఫీసు ద్వారా రానున్న మూడ్రోజుల్లో రూ.1,500 అందజేస్తామన్నారు.
శనివారం సంస్థ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 87.55 లక్షల కుటుంబాలకు గాను ఈ రెండ్రోజుల్లో 9 లక్షల (10%) మంది 37 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని తీసుకున్నారన్నారు. బియ్యం తీసుకోవడానికి లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. లబ్ధిదారులు భౌతికదూరాన్ని పాటిస్తూ బ్యాంకులు, పోస్టాఫీసుల నుంచి నగదును పొందాలన్నారు. గత నెల 23 వరకు రేషన్ పంపిణీ చేసినట్టుగానే ఈ నెల కూడా ప్రతి ఒక్క లబ్ధిదారుడికి రేషన్ అందేవరకు రేషన్ షాపులు తెరిచే ఉంటాయని తెలిపారు. చదవండి: అడవిబిడ్డలు ఆగమాగం
Comments
Please login to add a commentAdd a comment