కొత్త జిల్లాల వారీగా అక్షరాస్యత
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో జిల్లాల వారీగా అక్షరాస్యత లెక్కలను వయోజన విద్యా శాఖ తేల్చింది. జిల్లా వారీగా స్త్రీ, పురుషుల అక్షరాస్యత వివరాలతో కూడిన నివేదికను రూపొందించింది. 2011 జనాభా లెక్కల ఆధారంగా ఈ లెక్కలు వేసింది. అత్యధికంగా హైదరాబాద్‌లో 83.25% అక్షరాస్యత ఉన్నట్లు తేల్చింది. అందులో పురుషుల్లో 86.99 శాతం, మహిళల్లో 79.35% అక్షరాస్యత ఉన్నట్లు వెల్లడించింది. జోగుళాంబ జిల్లాలో అతి తక్కువగా 49.87% అక్షరాస్యత ఉన్నట్లు తెలిపింది. జోగుళాంబ జిల్లాలోని పురుషుల్లో 60.05%, మహిళల్లో 39.48% అక్షరాస్యత ఉన్నట్లు వివరించింది. జాతీయ అక్షరాస్యత 73% కాగా, రాష్ట్రంలో 66.54% అక్షరాస్యత ఉన్నట్లు తెలిపింది.
జిల్లాల వారీగా అక్షరాస్యత వివరాలు (శాతాల్లో)..
హైదరాబాద్ 83.25 శాతం, మేడ్చల్ 82.62, వరంగల్ అర్బన్ 76.19, రంగారెడ్డి 71.97, కరీంనగర్ 69.16, భద్రాద్రి 66.40, ఖమ్మం 65.87, పెద్దపల్లి 65.54, యాదాద్రి 65.52, మంచిర్యాల 64.78, సూర్యాపేట 64.11, నిజామాబాద్ 64.11 సంగారెడ్డి 64.04, నల్లగొండ 63.70, ఆదిలాబాద్ 63.29, రాజన్న జిల్లా 62.72, సిద్దిపేట 62.01, జనగాం 61.41, వరంగల్ రూరల్ 61.07, జగిత్యాల 60.58, జయశంకర్ జిల్లా 60.32, వికారాబాద్ 57.86, నిర్మల్ 57.82, మహబూబాబాద్ 57.05, మహబూబ్‌నగర్ 56.79, కుమ్రం భీం 56.70, కామారెడ్డి 56.48, మెదక్ 56.11, వనపర్తి 56.05, నాగర్ కర్నూలు 53.68, జోగుళాంబ 49.87 శాతం.