శిథిలాల కిందే మృతదేహాలు | The ongoing rescue operation | Sakshi
Sakshi News home page

శిథిలాల కిందే మృతదేహాలు

Published Fri, Apr 15 2016 1:08 AM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM

శిథిలాల కిందే మృతదేహాలు - Sakshi

శిథిలాల కిందే మృతదేహాలు

కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్న డెరైక్టర్, ఇతర అధికారులు
గురువారం సాయంత్రం వరకు  ఒక కార్మికుడి టోపీ లభ్యం..!
కుటుంబ సభ్యుల ఆందోళన శాంతిఖని గనిపై ఉద్రిక్త పరిస్థితులు

 

బెల్లంపల్లి(ఆదిలాబాద్) : మందమర్రి ఏరియా శాంతిఖని భూగర్భ గనిలో కూలిన పైకప్పు(భారీ బండరారుు) కింద చిక్కుకుపోరుు న ముగ్గురు కార్మికుల మృతదేహాలను వెలికితీయడానికి రెస్క్యూ సిబ్బంది నిర్విరామంగా శ్రమిస్తున్నారు. సంఘటన స్థలంలో ప్రతికూల పరిస్థితులను అంచనా వేస్తూ గురువారం రక్షణ చర్యలు చేపడుతూనే రెస్క్యూ ఆపరేష న్ నిర్వహిస్తున్నారు. మృతదేహాలను బయటకు తీసుకురావడంలో జాప్యం జరుగుతుండడంతో బాధిత కుటుం బాల నుంచి వ్యతిరేకత పెరుగుతోంది.
 

రెండు బృందాలతో ఆపరేషన్
గనిలోని 52 లెవల్ వన్ డీప్ జంక్షన్ వద్ద బుధవారం మధ్యాహ్నం సుమారు 1.45 గంటలకు పైకప్పు(పెద్ద బండరారుు) కూలిపోవడంతో ఆర్‌బీసీ కార్మికులు పోల్సాని హన్మంతరావు, రమావత్ కిష్టయ్య, మేషన్ మేస్త్రీ గాలిపల్లి పోశం దానికింద నలిగి పోరుున విషయం తెలిసిందే. దాదా పు వంద టన్నుల బరువు కలిగిన అనేక బండరాళ్లు కూలినట్లు తెలుస్తోంది. రెస్క్యూ సిబ్బంది ఎంతో నేర్పుతో ఓ పక్క పైకప్పునకు సపోర్టులు వేసుకుంటూ.. మరో పక్క బండల కింద జాకీలు పెట్టి క్రమంగా శిథిలాలను తొలగిస్తూ ముందుకు వెళ్తున్నారు. జనరేటర్‌కు కోల్ కట్టింగ్ మిషన్‌ను అనుసంధా నం చేసి బండరాళ్లను కట్ చేసి వాటిని ఎస్‌డీఎల్ యంత్రంతో ఎత్తివేస్తున్నారు. రామకృష్ణాపూర్ రెస్క్యూ సిబ్బందికి తోడుగా గోదావరిఖని నుంచి మరికొంత మందిని రప్పిం చారు. రెండు బృందాలుగా ఏర్పడి ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సమయం గడిచినా కొద్ది సంఘటన స్థలంలోని శిథిలాల నుంచి దుర్వాసన వస్తున్నట్లు సమాచా రం. గురువారం సాయంత్రం వరకు ఓ కార్మికుడి టోపీని కనుగొన్నట్లు తెలిసింది. మధ్య రాత్రి వరకు మృతదేహాలు లభించలేదు. శుక్రవారం ఉదయం వరకు వెలికితీసే అవకాశం ఉందని అంటున్నారు.

 

అధికారుల పర్యవేక్షణ
గనిలోకి సింగరేణి, మైనింగ్ అధికారులు దిగి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. డెరైక్టర్(పీపీ) మనోహర్‌రావు, డీజీఎంఎస్‌లు రమేశ్‌బాబు, కేడీ రామ్, సూర్జిత్‌కటేవా, డీఎంఎస్ దత్తా, సీజీఎం(సేఫ్టీ) సుగుణాకర్‌రెడ్డి, రెస్క్యూ జీఎం కె.మల్లికార్జున్‌రావు, జీఎం(సేఫ్టీ) ఎన్.జనార్దన్‌రావు, మందమర్రి ఏరియా జీఎం వెంకటేశ్వర్‌రెడ్డి, ఏజెంట్ వెంకటేశ్వర్లు, ఆర్‌జీఎం రీజియన్ జీఎం(క్వాలిటీ) నిరీక్షణ్‌రాజు, శాంతిఖని గని మేనేజర్ ఎం.శ్రీనివాస్, ఆర్‌కేపీ ఓసీ పీఓ సురేశ్ తదితరులు రెస్క్యూ సిబ్బంది వెన్నంటి ఉండి ఎప్పటికప్పుడు మార్గదర్శ కం చేస్తున్నారు.

 

గనిలోకి దిగిన నేతలు
కార్మిక సంఘాల నాయకులు ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. టీబీజీకేఎస్ అధ్యక్ష, కార్యదర్శులు కనకరాజు, మిర్యాల రాజిరెడ్డి, సింగరేణి కాల రీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి వి.సీతారామయ్య, సింగరేణి కోల్‌మైన్స్ లేబర్‌యూనియన్ వర్కింగ్‌ప్రసిడెంట్ బి.వెంకట్రావ్, సింగరేణి కాలరీస్ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ సీనియర్ జనరల్ సెక్రెట రీ బి.వెంకట్రావ్, ఉపాధ్యక్షుడు ఎస్.రాజమొగిళి, సి.హెచ్.వెంకటరమణ, కాంపెల్లి సమ్మయ్య, బానుదాసు పరిస్థితిని సమీక్షించారు.

 

ఇళ్ల వద్ద పడిగాపులు
గురువారం అర్ధరాత్రి వరకు కూడా మృతదేహాలు బయటకు రాకపోవడంతో మృతుల కుటుంబ సభ్యుల ఆక్రందనలకు అంతులేకుండా పోయింది. భార్యా పిల్లలు, బంధువులు, తోబుట్టువులు, స్నేహితులు గని వద్దకు వచ్చి గంటలకొద్దీ పడిగాపులు కాస్తున్నారు. ఏ క్షణాన మృతదేహాలను భూగర్భం నుంచి ఉపరితలానికి తీసుకువస్తారనే ఆతృతతో ఎదురుచూస్తున్నారు. మృతుల నివాస ప్రాంతాలైన సుభాష్‌నగర్, నం.2 ఇంక్లైన్, నం.2 ఇంక్లైన్ రడగంబాలబస్తీల్లో విషాద ఛాయలు అలుముకున్నారుు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement