టీఆర్‌ఎస్ నేతలూ.. మాటలు కట్టిపెట్టండి
టీడీపీ నేతలు పెద్దిరెడ్డి, రేవూరి
వరంగల్ : సీఎం కేసీఆర్ ఇప్పటికైనా గారడీ మాటలు..కల్లబొల్లి కబుర్లు కట్టిపెట్టాలని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఇనుగాల పెద్దిరెడ్డి అన్నారు. హన్మకొండ బాలసముద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ బూటకపు వాగ్దానాలు అయ్యాయన్నారు. చేస్తామని చెప్పడమే కాని ఇప్పటి వరకు చేసిం ది ఏమిలేదన్నారు. వరంగల్‌లో ఆసియాలోనే పెద్ద టెక్స్‌టైల్స్ పార్కు నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం దాని ఊసే ఎత్తడం లేదన్నారు. కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకే సీఎం కేసీఆర్ సాధ్యం కానిహామీలు ఇస్తూ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నాడని విమర్శించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లను వేలకొద్ది కట్టిస్తామని హామీ ఇస్తున్న నేతలు ఇప్పటి వరకు వందల్లోనే పూర్తి చేశారన్నారు. ఈలెక్కన అర్హులైన వారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలంటే ఆయన పదవీ కాలంసరి పోదన్నారు.ఇప్పటికైనా హామీ లుమరిచి పాలనపై దృష్టి పెట్టాలని సూచిం చారు.
జిల్లా అభివృద్ధిపై చర్చకు సిద్ధం..
టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే జిల్లా అభివృద్ధి జరిగిందని, టీడీపీ హయాం లో సున్న అన్న మంత్రి హరీష్‌రావుతో తాను బహిరంగ చర్చకు సిద్ధమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో అభివృద్ధి జరిగింది కేవలం సీఎం కేసీఆర్‌తో పాటు అయన కుటుంబ స భ్యులైన కేటీఆర్, కవిత, హరీష్‌రావులే అని అ న్నారు. పార్టీ అవిర్భావం నుంచి పనిచేస్తున్న వారిని విస్మరించి తెలంగాణ వద్దని ప్రకటన లు చేసిన, ఉద్యమకారులపై రాళ్లు వేసిన వారి కి టీఆర్‌ఎస్ పెద్దపీట వేయడం ఎంత వరకు సమంజసమన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు గండ్ర సత్యనారాయణ అధికార ప్రతినిధి మా ర్క విజయకుమార్, నాయకులు రఘునాథరెడ్డి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.