అశ్వారావుపేట (ఖమ్మం జిల్లా) : గిరిజన మహిళపై లైంగికదాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలం తిరుపతికొండకు చెందిన ఒక గిరిజన మహిళపై గత నెల 31న ప్రదీప్, వెంకన్నబాబు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేసిన పోలీసులు గురువారం వారిద్దరినీ అరెస్టు చేశారని డీఎస్పీ కవిత మీడియాకు తెలిపారు. మీడియా సమావేశంలో సీఐ రవికుమార్, ఎస్‌ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.