వాటర్‌గ్రిడ్ లైన్ సర్వే పూర్తి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ తాగునీటి ప్రాజెక్టు(వాటర్‌గ్రిడ్)కు సంబంధించిన లైన్ సర్వే దాదాపు అన్ని జిల్లాల్లో పూర్తయిందని పంచాయతీరాజ్ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. వాటర్‌గ్రిడ్ పనుల పురోగతిపై సోమవారం గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కీలకమైన లైన్‌సర్వే పూర్తయినందున సెగ్మెంట్ల వారీగా డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టులను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.
అలాగే ఇంటేక్‌వెల్స్ నిర్మాణ పనులు ఒకట్రెండు రోజుల్లో ప్రార ంభమయ్యేలా చర్యలు చేపట్టాలని సూచించారు. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు భారీగా నిధులిచ్చేందుకు దేశీయ ఆర్థిక సంస్థలతో పాటు అంతర్జాతీయ సంస్థలు కూడా ఆసక్తిని కనబరుస్తున్నాయని మంత్రి తెలిపారు. ఈ మేరకు ఏప్రిల్ మొదటి వారంలో జైకా, ఎల్‌ఐసీ, నాబార్డు, హడ్కో.. తదితర సంస్థలతో సమావేశమై చర్చించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.