కాంగ్రెస్ ను దోషిగా చూడటం తగదు:చిరంజీవి
ఢిల్లీ: సీఎం కిరణ్ కుమార్ రెడ్డిపై కేంద్రమంత్రి చిరంజీవి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ) బిల్లు లోక్ సభలో ఆమోదం పొందిన నేపథ్యంలో చిరంజీవి మీడియాతో మాట్లాడారు. సీఎం కిరణ్ ప్రజల్లో లేనిపోని ఆశలు రేపి మోసానికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. తాను చివరి బంతి వరకూ ఆడతానని చెప్పి సీమాంధ్ర ప్రజల్లో అపోహలు కల్పించారన్నారు. ప్రజల నమ్మకాలను సీఎం వమ్ము చేశారని విమర్శించారు.
ఆయన ఏమి చెప్పారో ఆ గమ్యాన్నిచేరుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. విభజన విషయంలో కాంగ్రెస్‌ను దోషిగా చూడొద్దని..ఇదే అంశంపై అన్నిపార్టీలు లేఖలు ఇచ్చాయని చిరంజీవి తెలిపారు.