అల్లరి ట్రంప్‌.. కాదు.. | duplicate trump playing with childrens | Sakshi
Sakshi News home page

అల్లరి ట్రంప్‌.. కాదు..

Published Sun, Jun 4 2017 1:48 PM | Last Updated on Sat, Aug 25 2018 7:52 PM

అల్లరి ట్రంప్‌.. కాదు.. - Sakshi

అల్లరి ట్రంప్‌.. కాదు..

చిన్న పిల్లలకు ఇల్లు, బడి ఒక్కటే. ఎ‍క్కడైన అల్లరి చేయాల్సిందే. కాదూ, కూడదంటే మారాం చేస్తారు. గద్దిస్తే నేలమీద పడి దొర్లి దొర్లి ఏడుస్తారు.

పిల్లలు చేసే ఈ తరహా అల్లరి పెద్దలు చేస్తే ఎలా ఉంటుంది? అందులోనూ ప్రపంచ పెద్దన్న డొనాల్డ్‌ ట్రంప్‌ మారం చేస్తూ నేలపై గిలగిలా కొట్టుకుంటే? నిజంగా అలాంటి సందర్భంరానేరాదు. కానీ ఆ ఐడియా ఆధారంగా తీసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌(డూప్‌) పిల్లలతో కలిసి గంతులెయ్యడం, ఉపాధ్యక్షుడు మైక్‌ పేన్స్‌(డూప్‌) వద్దని వారించడం.. ఎంతకీ వినని ట్రంప్‌ నేలపై గిలగిలా తన్నుకోవడం లాంటి దృశ్యాలున్న ఈ విడియోను ఇప్పటికే లక్షల మంది వీక్షించారు. వేలమంది షేర్‌ చేసుకున్నారు. గతంలోనూ ట్రంప్‌ డూప్‌లతో రూపొందించిన వీడియోలు, ఫొటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆదివారం ఆటవిడుపుగా ‘అల్లరి ట్రంప్‌’పై మీరూ ఓ లుక్కేయండి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement