‘నగ’ధీరుడు! | gents are showing interest to buy platinum | Sakshi
Sakshi News home page

‘నగ’ధీరుడు!

Published Thu, Dec 26 2013 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM

‘నగ’ధీరుడు!

‘నగ’ధీరుడు!

 పురుషుల ఆభరణాల
     కీలక మార్కెట్లలో హైదరాబాద్
   పుత్తడి కంటే ప్లాటినంపైనే అధికాసక్తి
   ప్లాటినం గిల్డ్ సర్వేలో వెల్లడి
 
 ముంబై: ఆభరణాలపై మోజు అతివలకే కాదు పురుషులకు కూడా పెరిగిపోతోంది. నగలు ధరించి ధగధగలాడిపోవాలనుకుంటున్న పురుష పుంగవులు పెరిగిపోతున్నారని, ఇలాంటివారి సంఖ్య మెట్రో నగరాల్లో మరింతగా ఉందని ప్లాటినమ్ గిల్డ్ తాజా సర్వేలో తేలింది. మగవాళ్ల ఆభరణాల కీలక మార్కెట్లలో ఒకటిగా హైదరాబాద్ నిలిచిందని ఈ సర్వే వెల్లడించింది. పురుషుల లగ్జరీ యాక్సెసరీలు, ఆభరణాలకు సంబంధించి ప్రపంచంలోనే అతి పెద్ద మూడో మార్కెట్‌గా భారత్ అవతరించిందని పేర్కొంది.  చెన్నై, అహ్మదాబాద్, బెంగళూరు, ఢిల్లీ నగరాల్లో ఈ సంస్థ ఈ సర్వేను నిర్వహించింది. పురుషుల అభరణాల మార్కెట్, ఆభరణాలు ధరించడం పట్ల వారి అభిరుచులు, అభిప్రాయాలు తెలుసుకునే నిమిత్తం ప్లాటినమ్ గిల్డ్ ఇంటర్నేషనల్ ఈ సర్వే నిర్వహించింది.  ఈ సర్వే వివరాలను ప్లాటినమ్ గిల్డ్ ఇంటర్నేషనల్ ఇండియా మేనేజర్ వైశాలి బెనర్జీ చెప్పారు. ఈ సర్వేలో తేలిన వివరాల ప్రకారం..,


     పురుషులు ఆభరణాలను గుడ్డిగా ఏమీ కొనడం లేదు. ట్రెండ్స్‌ను బట్టి,  రీసెర్చ్ చేసి మరీ డిజైన్లు ఎంపిక చేసుకుంటున్నారు.
     ఆభరణాలు ధరించాలనే కోరిక మగవారిలో పెరిగిపోతోంది. ఆభరణాలు ధరించడం వయస్సులో పెద్దవారిమయ్యామనే గుర్తింపుగా యువకులు భావిస్తున్నారు.


     సొంతంగా తమకు కొనుగోలు శక్తి ఉందనే విషయాన్ని నగల కొనుగోలుతో వ్యక్తం చేస్తున్నామన్నది ఉత్తరాది మగవాళ్ల అభిప్రాయం.
     ఇక పురుషుల ఆభరణాల  మార్కెట్లలో కీలకమైన నగరాల్లో ఒకటిగా హైదరాబాద్ నిలిచింది. హైదరాబాద్‌తో పాటు ముంబై, అహ్మదాబాద్, బరోడా, పుణే, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కొచ్చిన్‌లు కూడా ఈ ఘనతను సాధించాయి.


     మగాళ్ల ఆబరణాల్లో ఉంగరాలు, గొలుసులు, బ్రాస్‌లెట్‌లకు ప్రాచుర్యం పెరుగుతోంది. ప్లాటి నం, పుత్తడిలతో తయారైన నగలపై పురుషులు  మక్కువ చూపిస్తున్నారు.  


  మరోవైపు పుత్తడి ఆభరణాల కన్నా ప్లాటినం ఆభరణాలపైనే పురుషులు అధిక ఆసక్తి చూపుతున్నారు. ప్లాటినం ఎక్కువగా అరుగుదలకు లోనుకాదనే అంశమే దీనికి ముఖ్య కారణం.


     అన్ని వయస్సుల మగవాళ్లూ విలువైన లోహాలను ఇన్వెస్ట్‌మెంట్ ఉద్దేశంతో కొంటున్నారు. ఇతర నగరాలతో పోల్చితే ఢిల్లీ, బెంగళూరు, చెన్నై నగరాల్లోని మగవాళ్లు అధికంగా ఆభరణాలను కొనుగోలు చేస్తున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement