ట్రంప్ దెబ్బకు కుప్పకూలిన ఐటీ షేర్లు | Infosys, TCS Shares Bleed As H-1B Bill Proposes Minimum Pay Be Doubled | Sakshi
Sakshi News home page

ట్రంప్ దెబ్బకు కుప్పకూలిన ఐటీ షేర్లు

Published Tue, Jan 31 2017 2:03 PM | Last Updated on Wed, Sep 26 2018 6:44 PM

ట్రంప్ దెబ్బకు కుప్పకూలిన ఐటీ షేర్లు - Sakshi

ట్రంప్ దెబ్బకు కుప్పకూలిన ఐటీ షేర్లు

భారత ఐటీ కంపెనీలకు షాకిస్తూ హెచ్-1బీ వీసాదారులకు ట్రంప్ తీసుకొచ్చిన కొత్త వేతన సవరణ చట్టంతో ఐటీ దిగ్గజ షేర్లు ఒక్కసారిగా కుప్పకూలాయి.  టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్యూఎల్ టెక్నాలజీస్ల మార్కెట్ విలువ దాదాపు రూ.48వేల కోట్ల మేర తుడిచిపెట్టుకుపోయింది. మిడ్ సైజ్ ఐటీ కంపెనీల షేర్లు భారీగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. టాటా సొల్యుషన్స్, మాస్టెక్, మైండ్ ట్రీ, ఎంఫాసిస్, కేపీఐటీ, ఎన్ఐఐటీ టెక్నాలజీస్, హెక్సావేర్, జియోమెట్రిక్ దాదాపు 5 శాతం మేర పడిపోతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజ్లో ఐటీ సబ్ ఇండెక్స్ 4 శాతం మేర క్షీణించి టాప్ సెక్టరల్ లూజర్గా ఉంది.
 
 హెచ్-1బీ వీసా హోల్డర్స్కు కనీస వేతనాన్ని 1,30,000 డాలర్లకు పెంచేలా ప్రతిపాదిస్తూ వేతన సంస్కరణ బిల్లును మంగళవారం కాంగ్రెస్ సభ్యుడు జో లోఫ్గ్రెన్ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. దీంతో దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీలు కుప్పకూలాయి. అమెరికాలోని స్థానికులకే కంపెనీలు ఎక్కువ ప్రాధాన్యమిచ్చేలా, కనీస వేతనం ఇప్పుడున్న దానికి రెట్టింపు ఉండేలా ఈ బిల్లును రూపొందించారు.  ప్రస్తుతం భారత ఐటీ కంపెనీలు అమెరికాలో హెచ్-1బీ వీసా హోల్డర్స్కు 60వేల డాలర్ల వేతనాన్ని మాత్రమే ఇస్తున్నాయి. ఈ వేతనాన్ని రెట్టింపు చేస్తూ 1,30,000 డాలర్లుగా బిల్లులో ప్రతిపాదించారు. దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి


(అమెరికా దిక్కులు పిక్కటిల్లేలా..)

(ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్‌)

(ట్రంప్‌ ‘నిషేధం’: ఐసిస్‌ విజయోత్సవాలు)

(ట్రంప్‌ చెప్పింది పచ్చి అబద్ధం!)

(అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి)

(ట్రంపోనమిక్స్‌ మనకు నష్టమా? లాభమా?)

(ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి!)

(ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో!)

(వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement