తేలికపాటి మోటారు వాహనాలు (కార్లు), రాష్ట్ర రవాణా బస్సులకు టోల్గేట్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ శుక్రవారం ప్రకటించారు. ముంబై నగరం, ముంబై-పుణె ఎక్స్ప్రెస్ వే, కొల్హాపూర్ మినహా రాష్ట్రంలో ఉన్న మిగిలిన 53 టోల్ ప్లాజాలలో ఈ మినహాయింపు వర్తిస్తుంది. ఇక మహారాష్ట్ర రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్, ప్రజా పనుల శాఖ నిర్వహించే 12 టోల్ ప్లాజాలను మే 31 అర్ధరాత్రి నుంచి పూర్తిగా మూసేస్తున్నారు.
ముంబై నగరంలోకి వచ్చి, వెళ్లే ఐదు పాయింట్లు, పుణె-ముంబై ఎక్స్ప్రెస్ వే, కొల్హాపూర్ నగరాల నుంచి మాత్రం భారీ స్థాయిలో ఆదాయం వస్తుంది కాబట్టి వాటి వద్ద ఈ మినహాయింపు వర్తించదని తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వంపై ఏడాదికి రూ. 500 కోట్ల భారం పడుతుంది.
కార్లు, బస్సులకు టోల్గేట్ మినహాయింపు!
Published Fri, Apr 10 2015 8:19 PM | Last Updated on Mon, Oct 8 2018 6:08 PM
Advertisement
Advertisement